Begin typing your search above and press return to search.

క‌త్రినా జీవితంలో మ‌రియా తెచ్చిన మార్పు!

తాజాగా బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ జీవితంలో కూడా వ్య‌క్తిగ‌తంగా మెచ్చిన రోల్ ఒక‌టుంద‌ని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   20 Jan 2024 3:30 AM GMT
క‌త్రినా జీవితంలో మ‌రియా తెచ్చిన మార్పు!
X

కొన్ని కొన్ని పాత్ర‌లు హీరో-హీరుయిన్ల జీవితాల్లో సైతం మార్పులు తెచ్చిన‌విగా చెబుతుంటారు. వ్య‌క్తిగ‌తంగా ఇష్ట‌ప‌డి చేసిన రోల్స్ కొన్ని ఉంటే..కేవ‌లం పారితోషికం కోసం చేసే సినిమా పాత్ర‌లు కొన్ని ఉంటాయి. తాజాగా బాలీవుడ్ బ్యూటీ క‌త్రినా కైఫ్ జీవితంలో కూడా వ్య‌క్తిగ‌తంగా మెచ్చిన రోల్ ఒక‌టుంద‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా రివీల్ చేసింది. ఇంత‌వ‌ర‌కూ క్యాట్ ఎన్నో సినిమాల్లో వైవిథ్య‌మైన పాత్ర‌లు చేసింది.

వాటిలో మ‌రెన్నో స‌వాళ్ల‌తోనూ కూడుకున్న పాత్ర‌లు ఉన్నాయి. ఛాలెంజ్ లు..స‌వాళ్లు విసిరిన‌ రోల్స్ ఎన్నో ఉన్నాయి. కానీ వాటి విష‌యంలో ఏనాడు ఇలా స్పందించింది లేదు. తొలిసారి మేరిక్రిస్మ‌స్ లో త‌న పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసి అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటుంది. విజ‌య్ సేతుప‌తి హీరోగా తమిళ్..హిందీలో ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన సినిమా యావ‌రేజ్ గా ఆడింది. అందులో క‌త్రినా త‌న పాత్ర గురించి ఇలా మాట్లాడింది.

`ఇందులో మ‌రియాది భిన్న‌మైన ప్ర‌పంచం. న‌ట‌న‌కు ఎంతో అవ‌కాశం ఉంది. షూటింగ్ ప్రారంభ‌మ‌య్యే ముందు ఈ సినిమా లో నా పాత్ర గురించి ద‌ర్శ‌కుడు శ్రీరామ్ తో దాదాపు ఏడాది పాటు ప్ర‌యాణం చేసాను. క‌థ చెప్ప‌డం పూర్తికాగానే మ‌రియా ఎవ‌రు? త‌న వెన‌కున్న క‌థేంటి? ఆమె జీవితంలో ఏం జ‌రిగింది? అని భిన్న కోణాల్లో ఆలోచించ‌మ‌ని చెప్పారు. అలా చేయ‌డం నాకెంతో మేలు చేసింది.

నేను స‌మ‌ర్దంగా న‌టించి ..నన్ను నేను కొత్త‌గా నిరూపించుకోవ‌డానికి దోహ‌ద ప‌డింది. ఇలాంటి పాత్ర‌లు చాలా అరుదుగా వ‌స్తుంటాయి. వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఈ పాత్ర నాలో చాలా ర‌కాల మార్పులు తీసు కొచ్చింది. అవి ఏంటి? అన్న‌ది ఇప్పుడే చెప్ప‌లేను` అని అంది. ఇటీవ‌లే క‌త్రినా `టైగ‌ర్ 3` తోనే భారీ విజ‌యం అందుకున్న సంగ‌తి తెలిసిందే. అందులో స‌ల్మాన్ ఖాన్ కి జోడీగా న‌టించి అమ్మ‌డు మ‌రోసారి స‌త్తా చాటింది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ని సాధించింది.