Begin typing your search above and press return to search.

శ్రీలీల కెరీర్‌ లో అతి పెద్ద మిస్సింగ్‌...!

శ్రీలీల మిస్ చేసుకున్న ఆ పాత్రకు గాను అఖిల్‌ సినిమా 'ఏజెంట్‌' లో నటించిన హీరోయిన్‌ సాక్షి వైద్య ని సంప్రదించారని తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 5:21 AM GMT
శ్రీలీల కెరీర్‌ లో అతి పెద్ద మిస్సింగ్‌...!
X

పెళ్లి సందడి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న కారణంగా ఈ అమ్మడిని చాలా మంది తెలుగు అమ్మాయిగానే పరిణగిస్తూ ఉన్నారు. తెలుగు అమ్మాయే అయినా కూడా కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఇంపోర్ట్‌ అయిన శ్రీలీల కి మొదటి సినిమాతోనే నిరాశ మిగిలింది. అయితే అదృష్టం బాగుండి వరుస సినిమాల్లో నటించే ఛాన్స్ లు దక్కించుకుంటూ ఉంది.

రవితేజ తో నటించిన ధమాకా సినిమా తర్వాత శ్రీ లీల టాలీవుడ్‌ లోనే మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపుగా పది సినిమాలు ఉన్నాయి. అందులో కొన్ని షూటింగ్‌ దశలో ఉంటే, కొన్ని విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ఇన్ని సినిమాల నడుమ కొన్ని సినిమా ఆఫర్లను ఆమె చేజార్చుకోవాల్సి వస్తుంది.

ఎంతటి హీరోయిన్ అయినా కూడా వరుసగా సినిమాలు చేస్తున్న సమయంలో డేట్లు సర్ధుబాటు చేయలేక పోవడం వల్ల కొన్ని సినిమాలను మిస్ అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు శ్రీ లీలకు అదే పరిస్థితి ఏర్పడింది. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా నుంచి శ్రీలీల తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొన్ని వారాల క్రితం విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి సినిమా నుంచి శ్రీలీల ను తప్పించి రష్మిక మందన్నా ను తీసుకోవడం జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిర్మాణ సంస్థ అధికారికంగా కొట్టిపారేసింది. విజయ్ దేవరకొండ సినిమా నుంచి హీరోయిన్‌ ను మార్చలేదు.. శ్రీలీల తమ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని క్లారిటీ ఇవ్వడం జరిగింది.

ఇంతలోనే మళ్లీ కొత్త వార్తలు పుట్టుకు వస్తున్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబో మూవీ ఇప్పటికే ప్రారంభం అవ్వాల్సి ఉంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు షూటింగ్‌ ను మొదలు పెట్టలేదు. పలు కారణాల వల్ల సినిమా ఆలస్యం అవ్వడంతో శ్రీలీల డేట్ల విషయంలో క్లాష్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయట.

పైగా శ్రీలీల ఒక వైపు నటిస్తూనే మరో వైపు చదువుకుంటూ ఉంది. ఆమె పరీక్షల సమయంలో ప్రతి సారి కూడా సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ వస్తోంది. ఈసారి పరీక్షల సమయంకు విజయ్ దేవరకొండ, గౌతమ్‌ తిన్ననూరి కాంబో సినిమాకు డేట్లు అడిగారట. దాంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందనే వార్తలు వస్తున్నాయి.

శ్రీలీల ప్రస్తుతం ఉన్న జోరులో విజయ్ దేవరకొండతో సినిమా చేసి, ఆ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకుంటే కెరీర్ మరింత ఊపు అందుకోవడం ఖాయం. అంతే కాకుండా కెరీర్‌ లో నిలిచి పోయే సినిమా గా.. పాత్ర గా ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ పెద్ద ఛాన్స్ ను శ్రీలీల మిస్ అవ్వబోతుందనే వార్తలు వస్తున్నాయి.

శ్రీలీల మిస్ చేసుకున్న ఆ పాత్రకు గాను అఖిల్‌ సినిమా 'ఏజెంట్‌' లో నటించిన హీరోయిన్‌ సాక్షి వైద్య ని సంప్రదించారని తెలుస్తోంది. విజయ్ దేవరకొండకు జోడీగా సాక్షి వైద్య అయితే బాగుంటుందని దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి భావిస్తున్నాడు అంటూ సమాచారం అందుతోంది. శ్రీలీల తప్పుకోవడం సాక్షి వైద్య ని ఎంపిక చేయడం అనే విషయాలపై యూనిట్‌ సభ్యుల్లో ఎవరైనా స్పందిస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.