Begin typing your search above and press return to search.

ఐపీఎల్‌, ఎండలు, ఎన్నికలు... వాయిదాల పర్వం

కానీ 2024 సమ్మర్ సీజన్ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా వృదా అవుతుంది.

By:  Tupaki Desk   |   17 April 2024 5:41 AM GMT
ఐపీఎల్‌, ఎండలు, ఎన్నికలు... వాయిదాల పర్వం
X

టాలీవుడ్‌ కు సమ్మర్‌ సీజన్ అనేది అతి పెద్ద సీజన్‌ అనడంలో సందేహం లేదు. మంచి సినిమాలు పడితే వెయ్యి కోట్లకు పైగా ఈ సమ్మర్ సీజన్‌ లో వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ 2024 సమ్మర్ సీజన్ మొత్తం కూడా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా వృదా అవుతుంది.

ఈ సమ్మర్ సీజన్‌ ఫ్యామిలీ స్టార్‌ సినిమాతో ఆరంభం అయ్యింది. ఆ సినిమా నిరాశ పరిచింది. టిల్లు స్క్వేర్ సినిమా వచ్చి మెప్పించింది.. ఆ తర్వాత వచ్చిన సినిమాలు, అంతకు ముందు వచ్చిన సినిమాలు ఏవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.

ప్రేక్షకులు థియేటర్లకు రాకుండా ఎండలు, ఐపీఎల్‌ మరియు ఎన్నికలు అడ్డు పడుతున్నాయి. అందుకే సినిమా ఇండస్ట్రీ లో కూడా కాస్త స్థబ్దత ఏర్పడింది. ఇలాంటి సమయంలో సినిమాను విడుదల చేసి నష్టపోవడం కంటే ఇంకెప్పుడు అయినా విడుదల చేసుకోవడం మంచిది అనే అభిప్రాయం ను చాలా మంది నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.

ఈనెలలో విడుదల అవ్వాల్సిన నవదీప్‌ 'లవ్‌ మౌళి' మరియు శశివదనే సినిమాలను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెలలో కూడా పెద్ద సినిమాలు లేవు. ప్రభాస్‌ ప్రాజెక్ట్‌ కే 'కల్కి' ని ఇప్పటికే వాయిదా వేయడం జరిగింది.

మొత్తానికి ఐపీఎల్‌, ఎండలు, ఎన్నికల వల్ల పదుల సంఖ్యలో సినిమాలు వాయిదాల పర్వం కొనసాగుతున్నాయి. ముందు ముందు ఒకే సారి పెద్ద, చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద క్యూ కట్టే అవకాశాలు ఉన్నాయి అనిపిస్తుంది. అలా అయినా ఇబ్బందే. జులై నుంచి సినిమాల జాతర మొదలయ్యే అవకాశం ఉంది.