Begin typing your search above and press return to search.

ఈ వారం థియేటర్స్, ఓటీటీలో.. మినిమమ్ ఫన్ పక్కా

ఈ సారి ఏప్రిల్ ఆరంభంలో పెద్ద స్టార్స్ ఎవరూ థియేటర్స్ లోకి రావడం లేదు. ఫ్యామిలీ స్టార్ మూవీతో విజయ్ దేవరకొండ మాత్రమే వస్తున్నాడు.

By:  Tupaki Desk   |   2 April 2024 5:37 AM GMT
ఈ వారం థియేటర్స్, ఓటీటీలో.. మినిమమ్ ఫన్ పక్కా
X

ఏప్రిల్ మొదటివారంలో వేసవి వినోదం మొదలుకాబోతోంది. స్కూల్స్ కి సెలవులు కూడా రావడంతో చిన్నారుల నుంచి పెద్దల వరకు వీకెండ్ సమయంలో అంతా కలిసి సినిమాలు చూడటానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే ఈ టైంలో స్టార్స్ తమ సినిమాలని రిలీజ్ కోసం ఉపయోగించుకుంటారు. ఈ సారి ఏప్రిల్ ఆరంభంలో పెద్ద స్టార్స్ ఎవరూ థియేటర్స్ లోకి రావడం లేదు. ఫ్యామిలీ స్టార్ మూవీతో విజయ్ దేవరకొండ మాత్రమే వస్తున్నాడు.

ఈ మూవీ ఏప్రిల్ 5న తెలుగు, తమిళ్ భాషలలో రిలీజ్ కాబోతోంది. అదే రోజు దొరసాని ఫేమ్ కెవిఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన భరతనాట్యం అనే క్రైమ్ కామెడీ మూవీ రిలీజ్ అవుతోంది. ఏప్రిల్ 6న బహుముఖం అనే ఓ చిన్న సినిమా రిలీజ్ కానుంది. మలయాళీ సూపర్ హిట్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ తెలుగు వెర్షన్ ఏప్రిల్ 6న థియేటర్స్ లోకి వస్తోంది. ఈ సినిమా మంచి ఆదరణ లభించే ఛాన్స్ ఉంది. సందీప్ కిషన్ ప్రాజెక్ట్ జెడ్ మూవీ ఏప్రిల్ 6న రిలీజ్ అవుతోంది.

ఇక ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా చూసుకుంటే అమెజాన్ ప్రైమ్ లో హాలీవుడ్ మూవీ మ్యూజికా పై అందరి ఫోకస్ ఉంది. యే మేరీ ఫ్యామిలీ వెబ్ సిరీస్ సీజన్ 3 అదే రోజు రిలీజ్ కాబోతోంది. హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ మూవీ ఏప్రిల్ 5 రిలీజ్ కాబోతోంది. నెట్ ఫ్లిక్స్ లో టు గెదర్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి వచ్చింది.

గోపీచంద్ హీరోగా తెరకెక్కిన భీమా మూవీ ఏప్రిల్ 5న స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ సినిమా కోసం చాలామంది ఆడియెన్స్ ఎదురు చూస్తున్నారు. మరీ రిలీజ్ అవుతున్న సినిమాలలో వెబ్ సిరీస్ లలో ఏవి ఎక్కువ స్తాయిల్ ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటాయో చూడాలి.

ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాల లిస్ట్ :

అమెజాన్ ప్రైమ్

మ్యూజికా (హాలీవుడ్) : ఏప్రిల్ 04

యే మేరీ ఫ్యామిలీ (వెబ్ సిరీస్-3) : ఏప్రిల్ 04

హౌ టు డేట్ బిల్లీ వాల్ష్ (హాలీవుడ్) : ఏప్రిల్ 05

నెట్ ఫ్లిక్స్

టు గెదర్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 02

రిప్ లే(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 04

పారా సైట్ – ది గ్రే(కొరియన్ సిరీస్) : ఏప్రిల్ 05

స్కూప్(హాలీవుడ్) : ఏప్రిల్ 05

ఫైల్స్ ఆఫ్ ది అన్ ఎక్స్ ప్లైన్డ్(వెబ్ సిరీస్) : ఏప్రిల్ 03

జీ 5

ఫర్రే(హిందీ) : ఏప్రిల్ 05

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

లంబసింగి : ఏప్రిల్ 02

భీమా: ఏప్రిల్ 05

ఆపిల్ టీవీ ప్లస్

లూట్ (వెబ్ సిరీస్) : ఏప్రిల్ 03

సుగర్ (హాలీవుడ్) : ఏప్రిల్ 05