ఈ వారం విధ్వంసం ఎలా ఉంటుందంటే?
థియేటర్లు వద్దు..ఓటీటీ ముద్దు అంటూ ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 Jun 2025 3:00 AM ISTథియేటర్లు వద్దు..ఓటీటీ ముద్దు అంటూ ప్రేక్షకులు ఎంటర్ టైన్ మెంట్ కోరుకుంటున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు థియేటర్లో కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఎదురు చూసేవారు. ఇప్పుడా సన్నివేశం లేదు. ఓటీటీలో ఏ వారం ఏ సినిమా రిలీజ్ అవుతుంది? అన్నది ఆసక్తికరం గామారింది. ఓటీ టీలు ఇచ్చే రిలీజ్ అప్ డేట్స్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ వారం ఓటీటీలో ఆడుతోన్న చిత్రాలు చూస్తే...
సమంత తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ పై తొలి ప్రయత్నంగా `శుభం` చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 9న థియేటర్లో రిలీజ్ అయింది. హర్షిత్ ఆర్, శ్రీనివాస్ గవిరెడ్డి, శ్రియా కొంతమ్, షాలిన కొండెపుడి, వంశీధర్ గౌడ్ లు తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాకు పర్వాలేదనే టాక్ వచ్చింది. ఈ సినిమా జూన్ 13 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది.
అలాగే శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఇవనా నటించిన `#సింగిల్` థియేట్రికల్ గా మంచి విజయం సాధించింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 6 నుంచే అమెజాన్ ప్రైమ్ లో అందు బాటులో ఉంది. రీతూ వర్మ నటించిన చిత్రం 'దేవికా & డానీ`. కామెడీ హార్రర్ ఫాంటసీ సిరీస్ గా జియో హాట్ స్టార్ లోకి వచ్చేసింది. జూన్ 6 నుంచి ఈ సిరీస్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో రీతూ వర్మ, సూర్య వశిష్ట లీడ్ రోల్స్ లో నటించారు.
అలాగే కమెడియన్ సప్తగరి నటించిన `పెళ్లి కానీ ప్రసాద్` మార్చిలోనే రిలీజ్ అయింది. కానీ ఓటీటీ రిలీజ్ ఆస్యమైంది. ఈటీవీ విన్ లో జూన్ 5 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే బాలీవుడ్ స్టార్ సన్ని డియోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన `జాట్` థియేట్రికల్ గా మంచి సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో జూన్ 5 నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. నేచురల్ స్టాని `హిట్ 3` థియేటర్లలో రిలీజ్ అవ్వగా ప్రస్తుతం ఓటీటీ నెట్ ప్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
సూర్య, పూజాహెగ్డే నటించిన `రెట్రో` థియేట్రికల్ గా ఫెయిలైంది. ఈ సినిమా కూడా నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. రాజ్ కుమార్ రావ్, వామికా గబ్బి నటించిన `భూల్ చుక్ మాఫ్` మే 23 థియేటర్లో రిలీజ్ అయి ప్లాప్ అయింది. ఈ సినిమా అప్పుడే అమోజాన్ లో అందుబాటులో ఉంది. దుల్కర్ సల్మాన్ నటించిన మలయాళ చిత్రం `ఒరు యమండన్ ప్రేమ కథ` జూన్ 5 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో మరెన్నో చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
