Begin typing your search above and press return to search.

ఇలా బయపెడితే ఎలా థమన్?

గుంటూరు గౌరీ శంకర్ థియేటర్స్ వారు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ఎవరైనా థమన్ ని కంట్రోల్ చేయడంపై కాస్తా దృష్టి పెట్టండి. అతని మ్యూజిక్ ఆడియో డిసిబిల్స్ లెవల్స్ దాటిపోతున్నాయి.

By:  Tupaki Desk   |   29 Sept 2023 5:49 PM IST
ఇలా బయపెడితే ఎలా థమన్?
X

మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న టాలెంటెడ్ సంగీత దర్శకుడు థమన్. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధికంగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్నది కూడా థమన్ కావడం విశేషం. తాజాగా అతని నుంచి స్కంద మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తో ప్రస్తుతానికి నడుస్తోంది.

అయితే సినిమాలో థమన్ మ్యూజిక్ కి మాత్రం అందరూ భయపడుతున్నారు. బోయపాటి అఖండ సినిమాలో హై పిచ్ లో మ్యూజిక్ ఇచ్చి గూస్ బాంబ్స్ క్రియేట్ చేసిన థమన్ స్కందకి అంతకు మించి ఇచ్చాడంట. ఓ విధంగా చెప్పాలంటే కథకి కూడా అవసరానికి మించి ఇచ్చాడని అంటున్నారు. యూఎస్ అయితే థియేటర్స్ లో వేల్యూమ్ తగ్గించి సినిమాని ప్లే చేయాలని మేకర్స్ ని థియేటర్ ఓనర్స్ రిక్వస్ట్ చేసారంట.

అలాగే సినిమా చూడటానికి వచ్చే వారికి కూడా వార్నింగ్ అలర్ట్స్ ఇస్తున్నారంట. బోయపాటి సినిమాలు ఇష్టపడే వారికి మాత్రం ఈ మ్యూజిక్ బాగా నచ్చింది. గుంటూరు గౌరీ శంకర్ థియేటర్స్ వారు ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ లో ఎవరైనా థమన్ ని కంట్రోల్ చేయడంపై కాస్తా దృష్టి పెట్టండి. అతని మ్యూజిక్ ఆడియో డిసిబిల్స్ లెవల్స్ దాటిపోతున్నాయి. అతను ఇచ్చే సౌండ్స్ కి థియేటర్ ఓనర్స్ అందరూ భయపడుతున్నారు.

థియేటర్స్ లో కొంత పరిధి వరకే ఉండే సౌండింగ్ సిస్టం ఎక్కడ డ్యామేజ్ అవుతుందో అనే టెన్షన్ లో ఉన్నారు అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఓ విధంగా ప్రశంసించే విధంగా ఉన్న మరో వైపు విమర్శనాత్మకంగా కూడా ఉంది. దీనిపై భిన్నమైన కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

స్కంద సినిమాకి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగుందని చెబుతూనే, కచ్చితంగా ఆ సౌండ్స్ కి చెవులు డ్యామేజ్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా స్కంద చిత్రంతో థమన్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.