Begin typing your search above and press return to search.

ఈవారం ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో 10, ఓటీటీలో 9

దసరా పండగ దగ్గరపడుతోంది. అన్నీ స్టార్ హీరోల సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికన్నా ముందు కొన్ని చిత్రాలు బాక్సీఫీస్ ముందు క్యూ కట్టనున్నాయి

By:  Tupaki Desk   |   9 Oct 2023 6:15 AM GMT
ఈవారం ఎంటర్టైన్మెంట్.. థియేటర్లలో 10, ఓటీటీలో 9
X

దసరా పండగ దగ్గరపడుతోంది. అన్నీ స్టార్ హీరోల సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అయితే వాటికన్నా ముందు కొన్ని చిత్రాలు బాక్సీఫీస్ ముందు క్యూ కట్టనున్నాయి. ఓటీటీలోనూ ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమా సిరీస్​లు స్ట్రీమింగ్​కు రెడీ అయ్యాయి.

నయనతార, జయం రవి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఇరైవన్‌' చిత్రం తెలుగులో గాడ్‌ పేరుతో అక్టోబరు 13న విడుదల కానుంది. పులివెందుల మహేశ్, ప్రియాపాల్‌ జంటగా శివరామ్‌ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన 'మా ఊరి సిన్మా'.. అక్టోబరు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయిరామ్‌ శంకర్‌ హీరోగా సునీల్‌ కీలక పాత్రలో నవీన్‌ రెడ్డి తెరకెక్కించిన 'వెయ్‌ దరువెయ్‌' అక్టోబరు 13న విడుదలకు సిద్ధమైంది.

శివ కంఠమనేని హీరోగా నటించిన చిత్రం 'మధురపూడి గ్రామం అనే నేను'. క్యాథలిన్‌ గౌడ హీరోయిన్. ఓ ఊరి బయోపిక్‌గా రానున్న ఈ చిత్రం అక్టోబరు 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళంలో రూపొందిన 'రతినిర్వేదం' ఈ నెల 13న రీరిలీజ్​కు రెడీ అయింది. వీటితో పాటు 'సగిలేటి కథ'(అక్టోబరు 13), 'రాక్షస కావ్యం'(అక్టోబరు 13), 'నీతోనే నేను' (అక్టోబరు 13) 'తంతిరం' (అక్టోబరు 13),యూనివర్సిటీ, పెళ్లెప్పుడు వంటి తెలుగు చిత్రాలు, ధక్‌ ధక్‌, భగవాన్‌ భరోసా వంటి హిందీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి.

ఈ వారం ఓటీటీలోనూ పలు చిత్రాలు/సిరీస్‌లు వస్తున్నాయి. 'జీ5'లో సంగీత్‌ శోభన్‌ ప్రేమ ప్రయాణం అక్టోబర్‌ 13 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. 'నెట్‌ఫ్లిక్స్'​లో మార్గాక్స్‌ (హాలీవుడ్‌) అక్టోబరు 9, బిగ్‌ వాప్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 11, కాసర్‌గోల్డ్‌ (మలయాళం) అక్టోబరు 13, అన్స్​ అపాన్​ ఏ స్టార్ అక్టోబర్ 11... 'డిస్నీ+హాట్‌స్టార్​'లో మతగం (తమిళం) అక్టోబరు 12, గూస్‌ బంప్స్‌ (వెబ్‌సిరీస్‌) అక్టోబరు 13, సుల్తాన్‌ ఆఫ్ ఢిల్లీ (హిందీ) అక్టోబరు 13... 'ఆహా'లో మట్టి కథ (తెలుగు) అక్టోబరు 13.. 'బుక్‌ మై షో'లో మిషన్‌ ఇంపాజిబుల్‌ డెడ్‌ రెకనింగ్‌ 1 (హాలీవుడ్) అక్టోబరు 11 స్ట్రీమింగ్‌ కానుంది. వీటిలో మిషన్ ఇంపాజిబుల్, మట్టి కథ, కాసర్ గోల్డ్, అన్స్ అపాన్ ఏ స్టార్​పై స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నాయి.