ఆ విషయంలో హీరోల మధ్య ఐక్యత ఎక్కడ?
ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడటం అన్నది తగ్గింది. రాను రాను ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
By: Tupaki Desk | 6 Jun 2025 11:15 AMప్రేక్షకులు థియేటర్ కు వచ్చి సినిమా చూడటం అన్నది తగ్గింది. రాను రాను ఆ సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆక్యపెన్సీ యాభై శాతం కూడా కనిపించలేదు. పెరిగిన టికెట్ ధరలు భారంగా మారడంతో థియేటర్ వైపు చూడనది కొందరైతే? ఓటీటీలో రిలీజ్ అయితే కుటుంబ సమేతంగా చూడొచ్చు అన్నది మరికొంత మంది ఆలోచన. ఇంకొంత మంది ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత చూడొచ్చు అన్న అభిప్రా యంతో థియేటర్ వైపు చూడటం లేదు.
కారణాలు ఏవైనప్పటికీ ప్రేక్షకులకు థియేటర్ కు దూరం అవుతున్నారు అన్నది వాస్తవం. ఆక్యుపెన్సీ పెంచడం కోసం నిర్మాతలు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి సింగిల్ స్క్రీన్ థియేటర్లు పూర్తిగా మూత పడే పరిస్తితి కూడా దాపరించింది. ఇప్పటికే చాలా థియేటర్లు ఫంక్షన్ హల్స్ గా మారిపో యిన సంగతి తెలిసిందే. భవిష్యత్ లో మరిన్ని సింగిల్ స్క్రీన్స్ మూత పడటం ఖాయమని నిర్మాత బన్నీ వాస్ కూడా హెచ్చరించారు.
ఇప్పటికే నష్టాలను తట్టుకోవాలంటే మల్టీప్లెక్స్ తరహాలో పర్సంటేజ్ విధానం తమకు ఇవ్వాలని ఎగ్జిబిటర్ల నుంచి డిమాండ్ ఉంది. సాధ్యంకాని పక్షంలో థియేటర్లను మూసి వేస్తామని హెచ్చరించిన పరిస్థితి చూసాం. కానీ ఈ విషయంలో టాలీవుడ్ హీరోలు మాత్రం చోద్యం చూస్తున్నారు? అన్నది వాస్తవం. ఈ విషయంలో హీరోల మధ్య ఎలాంటి ఐక్యత కనిపించలేదు. ఇంత జరిగినా ఏ హీరో కూడా ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో స్పందించలేదు. ఈ నేపథ్యంలో థియేటర్ల పరిస్థితిని హీరోలు కూడా గమనించాలని బన్నీ వాస్ కోరాడు.
స్టార్ హీరోలంతా రెండేళ్లకు..మూడేళ్లకు ఒక సినిమా చేస్తే థియేటర్ కు ప్రేక్షకులు దూరమైపోతున్నారనే కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఎగ్జిబిటర్లు-నిర్మాతలు మాట్లాడుకోవాల్సింది పర్సంటేజ్ గురించి కాదు. జనాల్ని ఎలా థియేటర్ కు రప్పించాలన్నది సీరియస్ గా ఆలోచన చేయాల్సిన అంశంగా గుర్తు చేసారు. ఈ విషయంలో హీరోల మధ్య ఎంత మాత్రం ఐక్యత లేదన్నది వాస్తవం.
ఎవరికి వారు సినిమా షూటింగ్ లు..వాళ్ల పనుల్లో బిజీగా ఉండటం తప్ప ఇండస్ట్రీ పరిస్థితులపై ఎలాంటి ఆలోచన చేయలేదు. సినిమా రిలీజ్ ఉంటే మీడియా ముందుకొస్తున్నారు. లేదంటే? పత్తాలేని పరిస్థితి. మీడియా ముందు కొచ్చిన సందర్భంలో అభిమానులు లేనిదే మేము లేమంటూ నాలుగు కబుర్లు ఆడేసి వెళ్లిపోతున్నారు తప్ప నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలను పట్టించుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదు.
సినిమా అన్నది వ్యాపారమే అయినా? అభిమానం అనే ఆయుధాన్ని తెలివిగా వాడి స్కిప్ అవుతున్నారు. ఇప్పటికైనా హీరోలంతా ఒకే తాటిపైకొచ్చి ఐక్యంగా ప్రేక్షకుల్లో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. లేదం టే థియేటర్ వ్యవస్థ పూర్తిగా కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది. పైరసీ, ఓటీటీ మరింత విజృంభిస్తే మల్టీప్లెక్స్ లైనా మూసుకోవాల్సిందే. అప్పుడు చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే చూసుకోవాలి. ఇదే జరిగితే హీరోల మార్కెట్ పై కూడా ప్రభావం పడుతుంది. థియేటర్ రిలీజ్ కు ఉన్న కిక్ ఓటీటీ రిలీజ్ కి ఉండదు అప్పుడు పరిస్థితులు హీరోలకు పూర్తి ప్రతికూలంగా మారుతాయన్నది అంతే వాస్తవం.