Begin typing your search above and press return to search.

టాలీవుడ్‌లోకి ఫైరింజ‌న్‌లా దూసుకొస్తోంది

ఇటీవలి కాలంలో చాలా మంది ఉత్త‌రాది భామ‌లు ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   11 April 2024 2:46 PM GMT
టాలీవుడ్‌లోకి ఫైరింజ‌న్‌లా దూసుకొస్తోంది
X

మ‌త్తెక్కించే అందం.. కొంచెం న‌టించే ప్ర‌తిభ ఉంటే చాలు.. నేటిత‌రం భామ‌లు క‌థానాయిక‌లుగా అవ‌కాశాలు అందుకోవ‌డం క‌ష్ట‌మేమీ కాదు. మోడ‌లింగ్ రంగం నుంచి వ‌చ్చే భామ‌లు త్వ‌ర‌గా ఐబాల్స్ ని క్యాచ్ చేయ‌డ‌మే కాదు.. సాధ్య‌మైనంత వేగంగా సినిమా ప‌రిభాష‌ నేర్చుకునే యాటిట్యూడ్ తో ఉంటారు. అందువ‌ల్ల ద‌ర్శ‌కుల‌తో సింక్ అయ్యి ప‌ని చేస్తే ఔట్ పుట్ తేవ‌డం కూడా క‌ష్ట‌మేమీ కాదు. ఇటీవలి కాలంలో చాలా మంది ఉత్త‌రాది భామ‌లు ఇదే త‌ర‌హాలో టాలీవుడ్ లోకి ఆరంగేట్రం చేస్తున్నారు. ఇప్పుడు తెలుగు చిత్ర‌సీమ‌లో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ ఫేం భాగ్య‌శ్రీ బోర్సే ఇదే త‌ర‌హాలో అడుగుపెడుతోంది.


క‌వ్వించే అందం చందం అదిరిపోయే ఎక్స్ ప్రెష‌న్స్ తో ఈ బ్యూటీ క‌ళ్ల‌న్నీ త‌న‌వైపే తిప్పేసుకుంటోంది. కార‌ణం ఏదైనా కానీ ర‌వితేజ స‌ర‌స‌న మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ లో ఛాన్స్ అందుకున్న ఈ బ్యూటీ.. ఇంకా ఒక‌టో సినిమా అయినా రిలీజ్ కాకుండానే మ‌రో రెండు క్రేజీ ఆఫ‌ర్లు ఖాతాలో వేసుకుంది. యంగ్ ట్యాలెంటెడ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ స‌ర‌స‌న ఓ చిత్రంలో, నాని స‌ర‌స‌న మ‌రో చిత్రంలో న‌టించేందుకు ఇప్ప‌టికే సంత‌కం చేసింద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ఇంకా డెబ్యూ సినిమా రిలీజ్ కానే లేదు. త‌న ప్ర‌తిభ ఎలా ఉందో తెలియ‌నే తెలీదు. కానీ తన‌కు అప్పుడే మూడు సినిమాల్లో అవ‌కాశాలొచ్చాయి. వ‌రుస‌గా అడ్వాన్సులు అందుకుంటోంది. ఒక డెబ్యూ న‌టికి ఇంత క్రేజ్ ఉంది అంటే.. త‌న‌లో చాలా మ్యాట‌ర్ ఉంద‌నే భావించాల్సి ఉంటుంది.

అయితే భాగ్య‌శ్రీ భ‌విష్య‌త్ ఎలా ఉంటుందో ఇప్పుడే నిర్ణ‌యించ‌లేం. ఈ భామ ఇంకా డెబ్యూ న‌టి. హిందీలో యారియాన్ 2లో న‌టించింది. ఈ చిత్రంలో తెలుగు న‌టుడు ముర‌ళి శ‌ర్మ ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌గా, భూష‌ణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో యువ ప్రేమికురాలిగా ఎమోష‌న‌ల్ పాత్ర‌లో న‌టించింది. యారియాన్ 2లో త‌న న‌ట‌న ఆక‌ర్షించ‌డంతో అవ‌కాశాలిచ్చారా? అన్న‌ది అటుంచితే భాగ్య‌శ్రీ త‌న‌ను తాను నిరూపించుకునేందుకు చాలా శ్ర‌మించాల్సి ఉంటుంది. అందివ‌చ్చిన అవ‌కాశాల‌తో నిరూపించుకుంటుందేమో చూడాలి. భాగ్య‌శ్రీ క్లిక్క‌యితే శ్రీ‌లీల‌, జాన్వీ లాంటి యువ‌న‌టీమ‌ణుల‌కు పోటీగా మారుతుందేమో!