Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీతో ప్రాబ్ల‌మ్ లేదంటోన్న న‌టి!

ఆమె వాయిస్ స‌త్య‌కృష్ణ‌ని ప్ర‌త్యేకంగా హైలైట్ చేయ‌డంలో కీ రోల్ పోషించింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 10:30 AM GMT
ఇండ‌స్ట్రీతో ప్రాబ్ల‌మ్ లేదంటోన్న న‌టి!
X

రెండు దాశాబ్ధాలుగా తెలుగు చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో న‌టిగా కొన‌సాగుతోన్న న‌టి స‌త్య‌కృష్ణ‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `డాల‌ర్ డ్రీమ్స్` తో మొద‌లైన ఆమె సినీ ప్ర‌యాణం ఎంతో దేదీప్య‌మానంగా సాగిపోతుంది. ఇప్ప టివర‌కూ ఎన్నో వైవిథ్య‌మైన పాత్ర‌ల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ద‌క్కించుకున్నా రు. న‌టిగా త‌న‌కంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు. ఆమె వాయిస్ స‌త్య‌కృష్ణ‌ని ప్ర‌త్యేకంగా హైలైట్ చేయ‌డంలో కీ రోల్ పోషించింది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.


తాజాగా స‌త్య‌కృష్ణ ఓ ఇంటర్వ్యూలో ఆమె కెరీర్ జ‌ర్నికి సంబంధించి ఇంట్రెస్టింగ్ విష‌యాలు రివీల్ చేసారు. ఆవేంటో ఆమె మాట‌ల్లోనే.. నా మొదటి సినిమా `డాలర్ డ్రీమ్స్`. ఆ తరువాత చేసిన `ఆనంద్` .. `బొమ్మరిల్లు`తో నాకు మంచి గుర్తింపు ద‌క్కింది. మా ఫ్యామిలీలో అంతా జాబ్ చేసేవారే. సినిమా వైపుగా వచ్చింది నేను మాత్రమే. మా వారిది తమిళ ఫ్యామిలీ. వివాహమైన తరువాత సినిమాలు చేయడానికి ఎవరూ అభ్యంతర చెప్ప‌లేదు.

చెబుతార‌ని అనుకున్నా..కానీ నాకు అన్ని ర‌కాలుగా స్వేచ్ఛ క‌ల్పించారు. కెరియర్ ఆరంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి . అయినా వాటిని తట్టుకుని నిలబడ్డాను. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్ర లను మాత్రమే చేస్తూ వెళుతున్నాను. సినిమా ఇండస్ట్రీలో లేడీస్ ఫేస్ చేసే సమస్యలు ఎక్కువనే టాక్ ఉంది. అవి అన్ని చోట్లా ఉండేవే. కాకపోతే మిగ‌తా ప‌రిశ్ర‌మ‌ల కంటే సినిమా అనేసరికి ఎక్కువ ఫోకస్ ఉంటుంది.

అందువలన ఇక్కడి విషయాలు హైలైట్ అవుతూ ఉంటాయి. అన్ని చోట్లా ర‌క‌ర‌కాల మ‌నుషులు ఉంటారు. వాళ్లంద‌ర్నీ దాటుకుని వెళ్లాలి. ఎవరి పరిధిలో వారు ఉంటే ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉండవు. నేను అలాగే ఉంటాను. అందువలన ఇక్కడ నాకు ఎప్పుడూ కూడా అలాంటి పరిస్థితులు ఎదురు కాలేదు. కేవలం అన్నివేళ‌లా ప‌రిశ్ర‌మ వ్య‌క్తుల్నే టార్గెట్ చేయ‌డం అన్న‌ది భావ్యం కాదు` అని అన్నారు.