Begin typing your search above and press return to search.

న‌టి డ్రెస్ ఛేంజ్ రూమ్‌లోకి వ‌చ్చి త‌ప్పుగా..!

ఇంట‌ర్వ్యూలలో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తుంటే వినేందుకు జుగుప్సాక‌రంగానే ఉంది.

By:  Tupaki Desk   |   4 March 2024 5:58 AM GMT
న‌టి డ్రెస్ ఛేంజ్ రూమ్‌లోకి వ‌చ్చి త‌ప్పుగా..!
X

కాస్టింగ్ కౌచ్ అనేది నిరంత‌రం వినే మాట‌. గ్లామ‌ర్ ప్ర‌పంచంలో ఆక‌ర్ష‌ణ‌ల న‌డుమ ఇది చాలా స‌ర్వ‌సాధార‌ణ విష‌యంగా మారింది. చాలా మంది క‌థానాయిక‌లు, న‌టీమ‌ణులు మీటూ ఉద్య‌మం త‌ర్వాత ప్ర‌తిదీ ఓపెన‌వుతున్నారు. ఇంట‌ర్వ్యూలలో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పేస్తుంటే వినేందుకు జుగుప్సాక‌రంగానే ఉంది.

ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ సుంద‌రి కం సినీ న‌టి సౌమ్య శెట్టి పాత ఇంట‌ర్వ్యూ ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది. స్నేహితురాలి ఇంట్లో కేజీ బంగారం దొంగిలించి గోవాలో జ‌ల్సాలు చేస్తోంద‌న్న స‌మాచారంతో సౌమ్య శెట్టిని అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్న క్ర‌మంలో సౌమ్య ఇన్ స్టా రీల్స్ ఇప్పుడు మ‌రోసారి వైర‌ల్ గా మారుతున్నాయి.

ఇలా వైర‌ల్ అవుతున్న వాటిలో సౌమ్య ప్ర‌ముఖ యూట్యూబ్ మీడియా ఇంట‌ర్వ్యూలో త‌న‌కు జ‌రిగిన కాస్టింగ్ కౌచ్ అనుభ‌వం గురించి మాట్లాడిన వీడియో కూడా ఉంది. తాను డ్రెస్ ఛేంజ్ కోసం సెట్లో రూమ్ కి వెళ్లిన‌ప్పుడు త‌న వెంటే వ‌చ్చిన నిర్మాత త‌న‌తో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తించాడ‌ని, త‌న‌ను తిట్టి కొట్టాడ‌ని కూడా తెలిపారు. త‌న‌ను హెచ్చ‌రిస్తూ స‌ద‌రు నిర్మాత మాట్లాడేవార‌ని కూడా తెలిపారు. అలాగే ఇదే ఇంట‌ర్వ్యూలో త‌న లాంగ్ రిలేష‌న్ షిప్ గురించి కూడా సౌమ్య బ‌హిరంగంగా ముచ్చ‌టించారు. నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లి ప్ర‌స్థావ‌న లేకుండా న‌టిగా కొన‌సాగుతున్న విష‌యాన్ని సౌమ్యను యాంక‌ర్ ప్ర‌శ్నించ‌గా, ఆమె నిజాయితీగా వివ‌రాలు వెల్ల‌డించారు. త‌మ మ‌ధ్య గొప్ప స్నేహం , అండ‌ర్ స్టాండింగ్ ఉంద‌ని తెలిపారు.