Begin typing your search above and press return to search.

'దేవ‌ర' లో యాక్ష‌న్ ప్ర‌తీఫైట్ క్లైమాక్స్ లా!

యంగ్ టైగ‌న్ పాన్ ఇండియా ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌కుండా కొరటాల మార్క్ ని మించి ఉండ‌బో తుంది.

By:  Tupaki Desk   |   19 Dec 2023 2:30 PM GMT
దేవ‌ర లో యాక్ష‌న్ ప్ర‌తీఫైట్ క్లైమాక్స్ లా!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా కొర‌టాల శివ ద‌ర్శ‌త్వంలో పాన్ ఇండియాలో 'దేవ‌ర' తెర‌కెక్కు తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. ఇక‌పై దేవ‌ర నుంచి వ‌చ్చే ఒక్కో అప్ డేట్ అంత‌కు మించి అనిపిస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. యంగ్ టైగ‌న్ పాన్ ఇండియా ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌కుండా కొరటాల మార్క్ ని మించి ఉండ‌బో తుంది.

ఈ సినిమాతో కొర‌టాల న్యూ యాంగిల్ ని ప‌రిచ‌యం చేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఇక సినిమా యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయ‌ని తొలి నుంచి వినిపిస్తోంది. సముద్రం నేపథ్యంలో తెర‌కెక్కించే యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌కు ఓ కొత్త అనుభూతిని పంచుతాయి ..మునుపెన్న‌డు చూడ‌ని యాక్ష‌న్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని గెస్సింగ్స్ తెర‌పైకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సినిమా గురించి మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం లీకైంది.

ఈ సినిమాకి సంబంధించిన తదుపరి షెడ్యూల్ ను జనవరి మొదటి వారంలో ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం. సినిమాలో ప్రతినాయకుడిగా సైఫ్ అలీఖాన్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ - సైఫ్ కాంబినేషన్ లోని రెండు భారీ యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో చిత్రీక‌రించ‌నున్నారు. వీటికి పీట‌ర్ హెయిన్స్ ఫైట్స్ డిజైన్ చేసాడు. ఇవి ఎంతో సాహ‌సోపేతంగా ఉంటాయ‌ని..ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు త‌గ్గాప్ వార్ గా ఉంటాయ‌ని చిత్ర‌వ‌ర్గాలు అంటున్నాయి.

యాక్షన్ ఎపిసోడ్స్ చాలా కొత్తగా .. ఆశ్చర్యపోయేలా ఉంటాయనీ.. ప్రతి ఫైటూ క్లైమాక్స్ లా అనిపిస్తుందని అంటున్నారు. ఇక సినిమాలో జాన్వీ క‌పూర్ ప‌ల్లెటూరి అమ్మాయిగా గెట‌ప్ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టు కుంటోన్న సంగ‌తి తెలిసిందే. లంగావోణీ లో జాన్వీ తెలుగు యువ‌త‌కి మ‌రింత ద‌గ్గ‌రైంది. ఈసినిమా తో ప్రేక్షకుల హృద‌యాల్లో చిర‌స్థాయిగా నిలిచిపోతుంది అన్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తుంది. ఏప్రిల్ 5వ తేదీన పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.