Begin typing your search above and press return to search.

ట్రెండ్‌ని క్యాష్ చేసుకుంటున్నారా? టెర్ర‌ర్ రిపోర్ట్‌పై ఇండస్ట్రీలో టాక్!

ఈ ప్రాజెక్ట్‌ను కేవలం మరో సినిమా అనడం కంటే, ఒక పెద్ద స్ట్రాటజీగా చూడాల్సిన అవసర‌ముంద‌ని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   25 March 2026 1:42 PM IST
ట్రెండ్‌ని క్యాష్ చేసుకుంటున్నారా? టెర్ర‌ర్ రిపోర్ట్‌పై ఇండస్ట్రీలో టాక్!
X

ఇటీవలి కాలంలో భారతీయ సినీ పరిశ్రమలో నేషనలిస్ట్ థీమ్‌లకు సంబంధించిన సినిమాలు ప్రత్యేక ట్రెండ్‌గా మారాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనౌన్స్ చేయ‌బ‌డిన ది టెర్ర‌ర్ రిపోర్ట్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాజెక్ట్‌ను కేవలం మరో సినిమా అనడం కంటే, ఒక పెద్ద స్ట్రాటజీగా చూడాల్సిన అవసర‌ముంద‌ని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ది క‌శ్మీర్ ఫైల్స్, ఛావాల‌తో పోలుస్తూ!

2024లో రిలీజైన ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ గోద్రా ట్రైన్ ఘటనను ఆధారంగా తీసుకుని రూపొంది, ఒక వర్గం ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అదే సమయంలో ఆ సినిమా విమర్శల‌ను కూడా ఎదుర్కొంది. ఇప్పుడ‌దే లైన్‌లో ముందుకు వస్తున్న ది టెరర్ రిపోర్ట్‌పై సహజంగానే పోలికలు మొదలయ్యాయి. ముఖ్యంగా ది క‌శ్మీర్ ఫైల్స్, ఛావా లాంటి సినిమాల‌తో ఈ ప్రాజెక్ట్‌ను పోల్చుతూ, ఇది కూడా అదే నేషనలిస్ట్ ట్రెండ్‌ను కొనసాగిస్తుందా అనే ప్రశ్నలు లేవ‌నెత్తుతున్నాయి.

ది స‌బ‌ర్మ‌తి రిపోర్ట్ కు సీక్వెల్ గా

అయితే ఈ సినిమా కేవలం ట్రెండ్‌ను ఫాలో అవడమే కాకుండా, ఒక రిపోర్ట్ యూనివర్స్ కు బీజం వేయొచ్చని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ది సబర్మతి రిపోర్ట్‌కి ఇది సీక్వెల్‌గా భావించబడుతుండటం, భవిష్యత్తులో వేర్వేరు సంఘటనల ఆధారంగా మరిన్ని సినిమాలు తీసే అవకాశాలను సూచిస్తోంది. ఒకే బ్రాండ్ కింద రియల్ ఇన్సిడెంట్ థ్రిల్లర్స్‌ను నిర్మించే ప్రయత్నంగా దీన్ని విశ్లేషిస్తున్నారు.

డిబేట్ కు దారి తీస్తున్న అంశం

కంటెంట్ పరంగా చూస్తే, ఈ సినిమా టెర్ర‌ర్ ఎటాక్స్, క్రాస్ బోర్డర్ కార్యకలాపాలు, ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్ లాంటి అంశాలను టచ్ చేయనుంది. రియ‌ల్ లైఫ్ సంఘటనల ఆధారంగా కథను నిర్మించడం వల్ల ఇది రియలిజం వైపు మొగ్గు చూపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇదే అంశం మరోవైపు డిబేట్‌కు కూడా దారితీస్తోంది. ఇటువంటి సినిమాలు నిజాన్ని ప్రతిబింబిస్తాయా, లేక రాజకీయ కోణంతో ప్రెజెంట్ చేస్తాయా అనే ప్రశ్నలు మళ్లీ ముందుకు వస్తున్నాయి.

వరుసగా ఇలాంటి కథలతో సినిమాలు వస్తుండటంతో, ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారనే అభిప్రాయం కూడా బలపడుతోంది. కాబట్టి ది టెరర్ రిపోర్ట్ కు కేవలం థీమ్ సరిపోదు. కథనం, ట్రీట్మెంట్‌లో ప్రత్యేకత చూపాల్సిన అవసరం కూడా ఉంది. ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న బాలాజీ మోష‌న్ పిక్చ‌ర్స్ స్ట్రాటజీ కూడా ఆసక్తికరంగా మారింది. ఏక్తా క‌పూర్, శోభా క‌పూర్ బ్యాక్ టు బ్యాక్ ఇలాంటి కంటెంట్‌ను తీసుకురావడం ద్వారా ఒక నిర్దిష్ట మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో జర్నలిస్ట్‌గా పేరొందిన సుధీర్ మిశ్రా నిర్మాతగా ఈ ప్రాజెక్ట్‌తో ఎంట్రీ ఇవ్వడం కూడా విశేషం. కమర్షియల్ యాంగిల్ లో చూస్తే, నేషనలిస్ట్ జానర్ లో వ‌చ్చిన సినిమాలు గతంలో బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలు ఇచ్చిన సందర్భాలున్నాయి. దీంతో ఇదే ఫార్ములాను మరోసారి ఉపయోగించి విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంగా ది టెరర్ రిపోర్ట్ ను చూడవచ్చు. అయితే ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో, కేవలం ట్రెండ్‌ను అనుసరించడం సరిపోదు.