'ది రాజసాబ్' టీజర్‌పై అప్‌డేట్ ఇచ్చేసాడు!
ఈ నేపథ్యంలోనే యువ నిర్మాత ఎస్‌కెఎన్ ఈ మూవీ టీజర్ రిలీజ్‌పై క్రేజీ అప్ డేట్ ఇచ్చేశారు. మరో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రకటించారు.
By: Tupaki Desk | 23 May 2025 3:41 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ కామెడీ హారర్ థ్రిల్లర్ 'ది రాజా సాబ్'. మారుతి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి పాన్ ఇండియా మూవీ అండ్ భారీ బడ్జెట్ సినిమా కూడా. అంతే కాకుండా భారీ స్టార్‌తో మారుతి చేస్తున్న ఫస్ట్ మూవీ కూడా ఇదేయ కావడం గమనార్హం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో తొలి సారి చేస్తున్న కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఇది. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు.
ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యాడ్‌మ్యాన్ సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. నయనతార స్పెషల్ సాంగ్ చేస్తున్న ఈ మూవీ షూటింగ్ దాదాపుగా ఎండింగ్ దశకు చేరుకుంది. ఇటీవలే హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టారు. వెకేషన్ కోసం ఇటలీ వెళ్లిన ప్రభాస్ కూడా తిరిగి ఈ షూటింగ్‌లో పాల్గొననున్నారు. సంజయ్ దత్‌పై ఇటీవలే షూటింగ్ మొదలైంది. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్‌తో పాటు టీజర్ రిలీజ్ గత కొన్ని రోజులుగా వాయిదా పడుతూ వప్తోంది.
ఎట్టకుఏలకు బ్యాలెన్స్ షూటింగ్ స్టార్ట్ కావడంతో టీజర్ రిలీజ్‌పై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే యువ నిర్మాత ఎస్‌కెఎన్ ఈ మూవీ టీజర్ రిలీజ్‌పై క్రేజీ అప్ డేట్ ఇచ్చేశారు. మరో రెండు వారాల్లో టీజర్ రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని ప్రకటించారు. టీజర్ రిలీజ్‌కు అన్నీ సెట్ అయ్యాయని, టీజర్ వచ్చేస్తోందని, మారుతి కూడా హామీ ఇచ్చారని ఎస్‌కెఎన్ చెప్పడంతో ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.
రాజా సాబ్ టీజర్ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నామని ఫ్యాన్స్ సోషల్ మీడియమా వేదిగా గత కొంత కాలంగా రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా అప్ డేట్‌తో వారిలో సంబరాలు మొదలయ్యాయి. ఇప్పటికైనా టీజర్ రిలీజ్‌పై అప్ డేట్ వచ్చినందుకు ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో కామెంట్‌లు పెడుతున్నారు. ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో ఓటీటీ డీల్ కూడా ఇంకా పూర్తి కాలేదని తెలిసింది.
