రాజా సాబ్ రన్ టైమ్ పై మారుతి క్లారిటీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్.
By: Tupaki Desk | 16 Jun 2025 6:53 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది రాజా సాబ్. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజవగా ఆ టీజర్ కు ఫ్యాన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తుండగా, కొందరు మాత్రం టీజర్ లోని వీఎఫ్ఎక్స్ గురించి కామెంట్ చేస్తున్నారు. మొదట్లో మారుతితో సినిమా అన్నప్పుడు వద్దు బాబోయ్ అన్న వాళ్లే ఇప్పుడు రాజా సాబ్ టీజర్ గురించి గొప్పగా చెప్తున్నారు.
ఏదేతేనేం మారుతి నుంచి ఎవరూ ఊహించని అవుట్ పుట్ రాజా సాబ్ టీజర్ రూపంలో వచ్చేసింది. టీజర్ లో ప్రభాస్ ను వింటేజ్ లుక్ లో చూపించడంతో పాటూ హార్రర్ కామెడీ కథను మారుతి డీల్ చేసిన విధానం అందరినీ మెప్పించింది. సో సినిమా గురించి ఇక అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. రాజా సాబ్ కు సంబంధించిన అన్ని డౌట్లు తీరినట్టే.
టీజర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు డైరెక్టర్ మారుతి సమాధానమిచ్చాడు. అందులో భాగంగానే ది రాజా సాబ్ సినిమా రన్ టైమ్ గురించి మాట్లాడాడు మారుతి. రాజా సాబ్ నిడివి మూడున్నర గంటలుంటుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు మారుతి. ఈ సినిమాను హాలీవుడ్ కు తీసుకెళ్లాలనే ఉద్దేశం ఉందని, ఇంత రన్ టైమ్ అక్కడ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలని, డిస్నీ లాంటి సినిమాలను మనం కూడా తీయగలమని రాజా సాబ్ ప్రూవ్ చేస్తుందని మారుతి అన్నాడు.
తర్వాత మళ్లీ వెంటనే ఇందాక ఏదో ఫ్లో లో అన్నానని, రాజా సాబ్ సినిమా మూడు గంటలే ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు మారుతి. అంటే అతను చెప్పినదాన్ని బట్టి రాజా సాబ్ రన్ టైమ్ ను మూడు గంటలకే కుదించే అవకాశముంది. అయినా సినిమా బావుండి, కంటెంట్ ఎంగేజింగ్ గా అనిపిస్తే రన్ టైమ్ ను ఆడియన్స్ పెద్దగా పట్టించుకోరు. కేవలం కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడే రన్ టైమ్ సమస్యగా మారుతుంది. మూడు గంటలు అంటే ఎక్కువ రన్ టైమ్ ఏమీ కాదు కాబట్టి ఈ విషయంలో రాజా సాబ్ సేఫ్ అనే చెప్పుకోవాలి. ఇదే ఈవెంట్ లో రాజా సాబ్ పార్ట్2 గురించి కూడా మారుతి మాట్లాడాడు. రాజా సాబ్ రిలీజయ్యాక పార్ట్2 గురించి ఆలోచిస్తానని, కావాలని కథను సాగదీసి పార్ట్ 2 అంటూ రుద్దే ప్రయత్నం చేయనని మారుతి చెప్పాడు.
