Begin typing your search above and press return to search.

రాజాసాబ్ టీజర్‌.. ఈ కన్ఫ్యూజన్ తీరేదెప్పుడంటే..

సినిమాలో మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీతో సినిమా విజువల్‌గా గ్రాండ్‌గా ఉంటుందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   30 April 2025 10:00 PM IST
రాజాసాబ్ టీజర్‌.. ఈ కన్ఫ్యూజన్ తీరేదెప్పుడంటే..
X

టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ సినిమా షూటింగ్ అప్డేట్ కోసం కూడా సోషల్ మీడియాలో తరచుగా చిత్ర యూనిట్ కు రిక్వెస్ట్ లు పెడుతున్నారు. ముఖ్యంగా సినిమా టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు.

సినిమాలో మలవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీతో సినిమా విజువల్‌గా గ్రాండ్‌గా ఉంటుందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇటీవల పెద్ద హీరోల సినిమాలు సీరియస్ జోనర్‌లోనే ఎక్కువగా వచ్చాయి. ‘సలార్’, ‘కల్కి 2898 AD’ లాంటి యాక్షన్, సినిమాలతో ప్రేక్షకులు కాస్త బోర్ ఫీలయ్యారు.

అలాంటి సమయంలో ‘ది రాజాసాబ్’ లాంటి ఫుల్ హారర్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ రావడం ఫ్యాన్స్‌కు ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమా హారర్, రొమాన్స్, కామెడీని సమపాళ్లలో మిక్స్ చేస్తూ ప్రభాస్‌ను కొత్త లుక్‌లో చూపించనుంది. ఇక సినిమా రిలీజ్ డేట్ ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఇక టీజర్ రిలీక్ డేట్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నాడు, అతను తిరిగి వచ్చిన వెంటనే టీజర్ డబ్బింగ్ పూర్తి చేసి మే 2025లో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈ టీజర్ సినిమాపై హైప్‌ను మరింత పెంచనుంది. ‘ది రాజాసాబ్’ సినిమాలో ప్రభాస్‌ డబుల్ రోల్‌లో కనిపించనున్నట్టు టాక్. థియేటర్ ఓనర్‌గా, గోస్ట్‌గా సర్ ప్రైజ్ ఇవ్వనున్నట్లు గాసిప్స్ వస్తున్నాయి.

సినిమా షూటింగ్ దాదాపు 85% పూర్తయింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో క్లైమాక్స్ సీన్స్‌తో పాటు కొన్ని కామెడీ సీన్స్ చిత్రీకరించనున్నారు. మిగిలిన పాటలు, ప్యాచ్‌వర్క్ సమ్మర్ లోమీ పూర్తవుతాయి. సినిమాలో భారీ VFX వర్క్ ఉండటంతో పోస్ట్ ప్రొడక్షన్ కోసం సమయం తీసుకుంటున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 2025లో రిలీజ్ కానుందని సమాచారం. ఇక టీజర్ లో రిలీజ్ విషయంలో ఫైనల్ గా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.