రాజా సాబ్ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన నిర్మాత
వాస్తవానికైతే రాజా సాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కాలికి గాయం అవడంతో షూటింగ్ ఆగిపోయింది.
By: Tupaki Desk | 21 Jun 2025 3:04 PM ISTపాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ది రాజా సాబ్. ప్రభాస్ కెరీర్లోనే మొదటిసారిగా హార్రర్ థ్రిల్లర్ కామెడీ జానర్ లో చేస్తున్న సినిమా ఇది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పట్నుంచి మారుతిపై నమ్మకం ఏర్పడింది. రీసెంట్ గా రిలీజైన ది రాజా సాబ్ టీజర్ మారుతిపై ఉన్న నమ్మకాన్ని ఇంకాస్త పెంచింది.
వాస్తవానికైతే రాజా సాబ్ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తవాల్సింది కానీ మధ్యలో ప్రభాస్ కాలికి గాయం అవడంతో షూటింగ్ ఆగిపోయింది. దీంతో సినిమా లేటైంది. ప్రభాస్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు షూటింగ్ ను పూర్తి చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ది రాజా సాబ్ సినిమా షూటింగ్ 95% పూర్తైనట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆ మిగిలిన భాగం షూటింగ్ కూడా పూర్తి కానుంది.
ఈ విషయాన్ని స్వయంగా ది రాజా సాబ్ నిర్మాత టి.జి విశ్వప్రసాద్ తెలిపారు. భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్న ఆయన, రాజా సాబ్ ను ప్రపంచ స్థాయిలో గొప్పగా నిలబెట్టాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఆయన ది రాజా సాబ్ సినిమా షూటింగ్ పై అప్డేట్ ను ఇచ్చారు.
ది రాజా సాబ్ సినిమా షూటింగ్ 95% పూర్తైందని, మూడు పాటలు, చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలిందని, అది లేకపోతే షూటింగ్ పూర్తైనట్టేనని తెలిపారు. రాజా సాబ్ లోని వీఎఫ్ఎక్స్ ప్రపంచ స్థాయిలో ఉంటుందని, సినిమాలో 3డీ సీజీతో సహా అన్ని రకాల సీజీలు ఉంటాయని ఆయన వెల్లడించారు. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న ది రాజా సాబ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇండియాలోనే ఏ సినిమాకూ వేయనంత పెద్ద సెట్ లో ఈ హర్రర్ ఫాంటసీని తెరకెక్కిస్తున్నాడు మారుతి. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ నటిస్తుండగా, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.
