Begin typing your search above and press return to search.

నాని ఫ్యాన్స్ కు మళ్లీ షాక్… ఆగస్ట్ రిలీజ్ కూడా డౌటేనా?

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ది ప్యార‌డైజ్ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   1 May 2026 11:33 AM IST
నాని ఫ్యాన్స్ కు మళ్లీ షాక్… ఆగస్ట్ రిలీజ్ కూడా డౌటేనా?
X

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ది ప్యార‌డైజ్ సినిమా రిలీజ్ డేట్ విష‌యంలో ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది. మొదట ఈ సినిమాను మార్చ్ లో రిలీజ్ చేస్తామ‌ని ప్ర‌క‌టించిన మేకర్స్, తర్వాత దాన్ని ఆగస్ట్ 21కి వాయిదా వేశారు. అయితే ఇండస్ట్రీ లో వినిపిస్తున్న తాజా టాక్ ప్రకారం ఆ డేట్ కు కూడా ప్యార‌డైజ్ వ‌స్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదన్న సమాచారం, పెండింగ్‌లో ఉన్న కీలక షెడ్యూల్స్.. ఇవ‌న్నీ రిలీజ్ డేట్ పై అనుమానాల్ని పెంచుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌పై భారీ హైప్ ఉండటం, అలాగే ముందుగా అనౌన్స్ చేసిన డేట్స్ వరుసగా మారిపోవడం వల్ల ఈ వాయిదాల కథ మరింత చర్చనీయాంశంగా మారింది.

ఈ డిలేలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా సినిమా యొక్క భారీ స్థాయి నిలుస్తోంది. భారీ యాక్షన్ ఎపిసోడ్స్, విస్తృతమైన వీఎఫ్ఎక్స్ వ‌ర్క్స్, మరియు భారీ సెట్స్ వ‌ల్ల సినిమా అనుకున్న దానికంటే ఎక్కువ టైమ్ ను తీసుకుంటుంది. దీంతో షూటింగ్ పూర్తైన తర్వాత కూడా పోస్ట్ ప్రొడక్షన్‌కు మ‌రికొంత టైమ్ అవసరం అవుతోంది. దీంతో ట్రేడ్ వర్గాలు ఇప్పుడు అక్టోబర్ లేదా డిసెంబర్ రిలీజ్ ఛాన్సుల‌పై చర్చిస్తున్నాయి. కొంద‌రైతే సినిమా 2027లో రిలీజైనా ఆశ్చ‌ర్యపోవాల్సిన ప‌న్లేదంటున్నారు. దాదాపు రూ. 200 కోట్లకు చేరుతున్న బడ్జెట్ కూడా మేకర్స్‌పై ఎక్స్‌ట్రా ప్రెజ‌ర్ ను పెంచుతోంది. పబ్లిసిటీ ఖర్చులు కలిస్తే ఈ బ‌డ్జెట్ ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో, త్వర పడకుండా క్వాలిటీపై ఫోకస్ చేయాలనే ఆలోచన టీమ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది.

ఇదిలా ఉండగా, ఈ ప్రాజెక్ట్ రిలీజ్ టైమ్‌లైన్‌పై మరింత ప్రభావం చూపుతున్న కీలక అంశం మ్యూజిక్. ప్రముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ రవిచంద‌ర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా షేర్ సాంగ్ మంచి రెస్పాన్స్ అందుకోగా, సెకండ్ సాంగ్ మేలో రిలీజ‌వుతుంద‌నే ప్రచారం ఉంది. అయితే అనిరుధ్ బిజీ షెడ్యూల్ కారణంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ఆలస్యమవుతున్నాయన్న సమాచారం వినిపిస్తోంది. ఆయన తన ప్రతి సినిమాకు ఇచ్చే ఇంపాక్ట్‌ఫుల్ బీజీఎం కారణంగా, ఈ ప్రాజెక్ట్‌కు కూడా అదే స్థాయి ఔట్‌పుట్ ఇవ్వాలని టీమ్ భావిస్తోంది. దీంతో తొందరపడకుండా, అవసరమైతే అనిరుధ్‌కు ఎక్స్‌ట్రా టైమ్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డెసిష‌న్ క్రియేటివ్‌గా సరైనదే అయినప్పటికీ, రిలీజ్ డేట్‌పై డైరెక్ట్‌గా ప్రభావం చూపే అవకాశముంది.

అయితే సోష‌ల్ మీడియాలో ఇంత డిస్క‌ష‌న్స్ జ‌రుగుతున్నా, టీమ్ నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ రాకపోవడం కూడా ఊహాగానాలకు బలాన్నిస్తోంది. టీమ్ సైలెంట్ గా ఉండ‌టంతో పోస్ట్‌పోన్ ప‌క్కా అనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో బలపడుతోంది. గతంలో ద‌స‌రా సాధించిన స‌క్సెస్ తో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు అమాంతం పెరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ సినిమాను మించి ఇవ్వాలనే ఒత్తిడి డైరెక్ట‌ర్ శ్రీకాంత్ ఓదెల టీమ్‌పై ఉంది. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాలంటే మరో అఫీషియ‌ల్ అప్డేట్ వరకు వేచి చూడాల్సిందే.