Begin typing your search above and press return to search.

డాక్యు సిరీస్: కాశ్మీర్ లోయ‌లో దారుణాలపై లోకానికి తెలియ‌ని క‌థ‌లతో

ది కాశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్

By:  Tupaki Desk   |   20 July 2023 3:50 AM GMT
డాక్యు సిరీస్: కాశ్మీర్ లోయ‌లో దారుణాలపై లోకానికి తెలియ‌ని క‌థ‌లతో
X

కాశ్మీరీ పండిట్ల ఊచ‌కోత నేప‌థ్యంలో తెర‌కెక్కిన `కాశ్మీర్ ఫైల్స్` సినిమా తెర‌కెక్కి సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. తాష్కెంట్ ఫైల్స్ త‌ర్వాత వివేక్ అగ్నిహోత్రి ఈ చిత్రంతో మ‌రో ఘ‌న‌విజయాన్ని అందుకున్నారు. కాశ్మీర్ ఫైల్స్ విమ‌ర్శ‌ల‌తో పాటు ప్ర‌శంస‌లను అందించింది. అయితే కాశ్మీర్ ఫైల్స్ చిత్రంలో కాశ్మీర్ లోయ‌లో జ‌రిగిన అన్ని దారుణాల‌ను ఆయ‌న తెర‌పై ఆవిష్క‌రించ‌లేక‌పోయారు. అందుకే ఇప్పుడు `ది కాశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్` పేరుతో అక్క‌డి దారుణాల‌ను.. బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని వాస్త‌విక సంగ‌తుల‌ను ఓటీటీ తెర‌పై డాక్యు సిరీస్ రూపంలో చూపించ‌నున్నారు.

1990లో కాశ్మీరీ పండిట్ లు ఎన్నో దారుణాల్ని ఎదుర్కొన్నారు. వాటి గురించి ఎంత చెప్పినా తెలియ‌ని కోణాలు ఉన్నాయ‌ని అగ్నిహోత్రి తొలి నుంచి చెబుతున్నారు. హిస్ట‌రీలో కాశ్మీరీ పండిట్ల జీవితాల్లో నిర్లక్ష్యానికి గురైన అధ్యాయాలను వెలుగులోకి తెచ్చే సిరీస్ గా ఇది ఉంటుంద‌ని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది. కాశ్మీర్ లోయ‌లో దారుణాల‌ను ఎదుర్కొన్న‌ వ్యక్తులతో ఇంటర్వ్యూలను ఈసిరీస్ లో చూపించ‌నున్నారు.

ది కాశ్మీర్ ఫైల్స్ క‌రోనా క్రైసిస్ లోను ఊహించ‌ని రీతిలో ఘ‌న‌విజయం అందుకుంది. దానికి కొన‌సాగింపు చిత్రం తెర‌కెక్కిస్తున్నార‌న్న ప్ర‌చారం సాగినా ఇది డాక్యు సిరీస్ మాత్ర‌మేన‌ని టీజ‌ర్ తో స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. `ది కాశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్` కృష్ణ అనే కాశ్మీరీ హిందూ కళాశాల విద్యార్థిని కుటుంబం దారుణ హ‌త్య‌కు గుర‌య్యాక అన్వేష‌ణ నేప‌థ్యంలో సిరీస్. ఇందులో ఎన్నో క‌ఠోర స‌త్యాల‌పై ఇంట‌ర్వ్యూలను చూపించ‌నున్నారు. కాశ్మీర్ ఫైల్స్ విజ‌యం నేప‌థ్యంలో `ది కాశ్మీర్ ఫైల్స్: అన్ రిపోర్టెడ్` సిరీస్ విడుదల కోసం అభిమానులు ఉత్సాహంగా వేచి చూస్తున్నారు. ఈ సిరీస్ `ది కాశ్మీర్ ఫైల్స్` ని స్ట్రీమింగ్ చేసిన జీ5 OTTలో అందుబాటులోకి రానుంది.