Begin typing your search above and press return to search.

గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ టాక్ ఏంటి..?

సినిమాల్లో కోర్ట్ రూమ్ డ్రామా అంటే సినిమా రన్ టైం లోపు ముగించాలి కాబట్టి తీయాల్సిన సీన్స్ అన్నీ స్పీడ్ గా లాగిస్తారు.

By:  Tupaki Desk   |   4 July 2025 11:01 PM IST
గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ టాక్ ఏంటి..?
X

వెండితెర మీద కోర్ట్ లీగల్ డ్రామా సినిమాలకు కాస్త డిమాండ్ తక్కువే కానీ ఓటీటీల్లో మాత్రం ఏదో ఒక భాషలో ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. వాటిని ఓటీటీ ఆడియన్స్ ఆదరిస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా ప్రియమణి ప్రధాన పాత్రలో గుడ్ వైఫ్ అంటూ మరో కోర్ట్ డ్రామా వచ్చింది. జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సీరీస్ ని ఒకప్పటి హీరోయిన్ రేవతి తెరకెక్కించారు. మరి ఈ వెబ్ సీరీస్ టాక్ ఏంటన్నది చూద్దాం.

గుణ శీలన్ ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా చేస్తుంటాడు.. ఆయన భార్య తరుణిక తో ఎంతో ప్రేమగా ఉంటాడు. ఆదర్శ దంపతులు అంటే వీళ్లే అనేలా వీరిద్దరు ఉంటారు. ఐతే సెక్స్ కుంభకోణంలో గుణ శీలన్ జైలు పాలవడంతో చాలా అవమానాలు ఎదుర్కొంటారు. ఐతే ఆరోపణల్లో ఎంత నిజం ఉందో తెలియకుండానే గుణ శీలన్ ను దూరం పెడుతుంది. ఐతే ఫ్రెండ్ సాయంతో తను కూడా అడ్వకేట్ గా జాయిన్ అవుతుంది. తన భర్త కోసం న్యాయ పోరాటం చేసేందుకు వచ్చిందని అనుకుంటారు.. ఇంతకీ తరుణిక ఏం చేసింది..? తన భర్త గుణని జైలు నుంచి బయటకు వచ్చాడా లేదా..? తరుణిక ఏం చేసింది అన్నది గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ కథ.

సినిమాల్లో కోర్ట్ రూమ్ డ్రామా అంటే సినిమా రన్ టైం లోపు ముగించాలి కాబట్టి తీయాల్సిన సీన్స్ అన్నీ స్పీడ్ గా లాగిస్తారు. కానీ వెబ్ సీరీస్ లో అయితే వాటిని వివరణాత్మకంగా ఉంచుతారు. గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ లో కూడా చాలా విషయాలను చూపించారు.

గుడ్ వైఫ్ వెబ్ సీరీస్ మొత్తం 6 ఎపిసోడ్స్ తో వచ్చింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, బెంగాలిలో భాషలో కూడా అందుబాటులో ఉంది. కోర్ట్ రూమ్ డ్రామా లో సాగే వాద ప్రతివాదనల్లో పోటా పోటీ ఉంటుంది. కొన్ని సీన్స్ లో సీరీస్ ఇంప్రెస్ చేస్తుంది. ఐతే మొదలు పెట్టడం ఆసక్తికరంగా ఉన్నా తర్వాత తర్వాత ఆసక్తి పోగొట్టేలా ఉంది.

తరుణిక భర్త కేసుని పక్కన పెట్టి మిగతా విషయాల మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. అసలు ఒకానొక దశలో ఆమె న్యాయవాదిగా మారింది ఎవరి కోసం అనే డౌట్ వస్తుంది. ఐతే కొన్ని అంశాలు మరీ తేలికగా చూపించారు. అందులో గుణ బెయిల్ లాంటిది ఒకటి. మొత్తానికి ఈ సీరీస్ ఇంకాస్త గ్రిప్పింగ్ తో చేసి ఉంటే తప్పకుండా అలరించేది. ఐతే కోర్ట్ రూం డ్రామాస్ ఇష్టపడే వారికి ఇది కాస్త పర్వాలేదనిపిస్తుంది.