Begin typing your search above and press return to search.

రష్మిక పాటకు సమంత స్టెప్పులు.. డైరెక్టర్ కు టేక్ ఓకే

నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా చేతినిండా సినిమాలతో దూసుకపోతుంది. ఆమె ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

By:  Tupaki Desk   |   21 July 2025 9:41 AM IST
రష్మిక పాటకు సమంత స్టెప్పులు.. డైరెక్టర్ కు టేక్ ఓకే
X

నేషనల్ క్రష్ రష్మిక మంధన్నా చేతినిండా సినిమాలతో దూసుకపోతుంది. ఆమె ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఇన్ని రోజులు హీరోయిన్ గా కీలక పాత్రలు పోషించిన రష్మిక, ఈ సినిమాతో కంప్లీట్ లేడీ ఓరియంటేటెడ్ జానర్ గా తో మెప్పించడానికి ట్రై చేస్తోంది.


ఇటీవల ఈ సినిమా నుంచి మేకర్స్ నదివే పాట రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక రెడ్ కలర్ టైట్ ఔట్ ఫిట్ లో హీరోతో డ్యాన్స్ చేసింది. అయితే రష్మిక నుంచి ఈ రేంజ్ పెర్ఫార్మన్స్ ప్రేక్షకులు ఊహించలేదు. ఈ పాట ఫుల్ వైరల్ అవ్వడం తో సోషల్ మీడియాలో రీల్స్ కూడా చేస్తున్నారు.

ఈ ట్రెండ్ ఏకంగా సెలబ్రిటీల దాకా పాకింది. అయితే స్టార్ హీరోయిన్ సమంత- సీనియర్ నటుడు వెన్నెల కిషోర్ లు దర్శకుడు రాహుల్ కు బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. తన భార్య చిన్మయి, సమంత, రాహుల్, వెన్నెల కిషోర్ వీళ్లంతా ఓ బ్యాచ్. తాజాగా హీరోయిన్ సమంత- వెన్నెల కిషోర్ ఈ పాట రీ రిక్రియేట్ చేశారు. ఈ వీడియోను రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.

సమంత- వెన్నెల కిషోర్ నదివే పాట సీన్ ను రీక్రియేట్ చేశారు. కిషోర్ ఇంకో టేక్ తీలుకోవాల్సి ఉంది. అతడి ఎమోషన్ సరిగ్గా లేదు. సమంతా మాత్రం పర్ఫెక్ట్ గా చేసింది. రష్మిక, దీక్షిత్ శెట్టి మీరు ఏమంటారు. అని వాళ్లను రాహుల్ ఈ పోస్ట్ లో మెన్షన్ చేశారు. ఈ పోస్ట్ కు నటుడు దీక్షిత్ శెట్టి స్పందించారు. ఈ టేక్ తనకు ఓకే అని, తమ సినిమాలోని పాట రీ క్రియేట్ చేసినందుకు సమంత, వెన్నెల కిషోర్ కు తను థాంక్స్ చెబుతూ కామెంట్ చేశారు. నిమిషాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది. వేలల్లో లైక్స్ వచ్చాయి.

కాగా, ఈ సినిమాలో రష్మిక- దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ తెరక్కించిన ఈ సినిమా సెప్టెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.