సంజయ్ భాయ్ సినిమా ఓటీటీలో అయినా మెప్పిస్తుందా?
ది భూత్నీ సినిమా జీ సినిమాలతో పాటూ జీ5లో కూడా జులై 18 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టు సదరు ఓటీటీ సంస్థ అప్డేట్ ఇచ్చింది.
By: Tupaki Desk | 11 July 2025 5:00 AM ISTబాలీవుడ్ స్టార్ సంజయ్ దత్, సన్నీ సింగ్, మౌనీరాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ది భూత్నీ. మే 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా ఈ హార్రర్ కామెడీకి ఆడియన్స్ నుంచి మిక్డ్స్ టాక్ వచ్చింది. దీంతో సినిమాకు ఆశించిన కలెక్షన్లు రాలేదు. అయితే ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది. ది భూత్నీ మూవీ డిజిటల్ రైట్స్ జీ5 వద్ద ఉన్నాయి.
ది భూత్నీ సినిమా జీ సినిమాలతో పాటూ జీ5లో కూడా జులై 18 నుంచి స్ట్రీమింగ్ కు రానున్నట్టు సదరు ఓటీటీ సంస్థ అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాపైనా ఓటీటీ లోకి లేటుగా రావడానికి కారణం ఓటీటీ డీల్ ఆలస్యమవడం వల్లేనని తెలుస్తోంది. ముందు దీన్ని సినిమా రిలీజైన 8 వారాలకు ఓటీటీలోకి తీసుకొద్దామనుకున్నారు కానీ ఓటీటీ డీల్ లేటవడంతో ది భూత్నీ రిలీజ్ తర్వాత 11 వారాలకు ఓటీటీలోకి రాబోతుంది.
సిద్ధాంత్ సచ్‌దేవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హార్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. లవ్ బ్రేకప్ అయిందని సన్నీ సింగ్ ఓ చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉంటాడు. అతని బాధను ఆ చెట్టులో ఉన్న దెయ్యమైన మౌనీ రాయ్ విని కరిగిపోయి సన్నీ సింగ్ ను ఇష్టపడుతుంది. సన్నీ సింగ్ నుంచి తనను విడదీయాలనుకునే వారిని భయపెడుతూ ఉండే దెయ్యం నుంచి కాపాడటానికి సంజయ్ దత్ రంగంలోకి దిగుతారు. అసలు మౌనీ రాయ్ దెయ్యంగా ఎందుకు మారింది? దెయ్యమయ్యాక చెట్టులో ఎందుకు ఉంది? బాబా ఏం చేశాడనే నేపథ్యంలో ది భూత్నీ కథ ఉంటుంది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగిలింది. రూ.30 కోట్ల తో రూపొందిన ది భూత్నీకి ఫైనల్ రన్ ముగిసే నాటికి రూ.14.77 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చాయి. కాగా ది భూత్నీ సినిమాను సంజయ్ దత్, దీపక్ ముకుత్, మాన్యత దత్, హునార్ కలిసి సంయుక్తంగా నిర్మించారు. థియేటర్లలో మెప్పించలేక పోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా మెప్పిస్తుందేమో చూడాలి.
