రియాలిటీ టీవీ రంగంలో గేమ్ ఛేంజర్ అవుతుందా?
పాపులర్ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె తనదైన శైలిలో కంటెస్టెంట్లను ఆటపట్టిస్తూ షోను నడిపిస్తారు.
By: Tupaki Desk | 14 Jan 2026 8:00 AM ISTభారతీయ రియాలిటీ టీవీ రంగంలో బిగ్ బాస్ తర్వాత అంతకంటే భారీ స్థాయిలో రూపొందుతున్న సరికొత్త గేమ్ ఛేంజర్ `ద 50`. ఇది కేవలం ఒక రియాలిటీ షో మాత్రమే కాదు.. ఒక భారీ సామాజిక ప్రయోగం అని మేకర్స్ అభివర్ణిస్తున్నారు. ఈ షోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆసక్తికర విషయాలు తెలిసాయి.
షో కాన్సెప్ట్ పరిశీలిస్తే.. ఒకేసారి 50 మంది సెలబ్రిటీలు ఒకే ఇంటిలోకి (మహల్- అని పిలుస్తున్నారు) ప్రవేశిస్తారు. ఈ షోలో కచ్చితమైన నియమాలు ఏవీ ఉండవు. కంటెస్టెంట్లు తమకు నచ్చినట్లుగా వ్యూహాలు రచించుకోవచ్చు, పొత్తులు పెట్టుకోవచ్చు లేదా వెన్నుపోటు పొడవవచ్చు. షోను ఒక రహస్యమైన వ్యక్తి `ది లయన్` నియంత్రిస్తారు. అతడి ఆదేశాల ప్రకారమే ఆట మలుపులు తిరుగుతుంది.
పాపులర్ బాలీవుడ్ దర్శకురాలు, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె తనదైన శైలిలో కంటెస్టెంట్లను ఆటపట్టిస్తూ షోను నడిపిస్తారు. ఫిబ్రవరి 1 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఈ షోని ఎక్కడ చూడాలి? అంటే.. రాత్రి 9 గంటలకు జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే రాత్రి 10:30 గంటలకు కలర్స్ టీవీలో ప్రసారమవుతుంది.
ప్రేక్షకులకే ప్రైజ్ మనీ!
ఈ షో రెగ్యులర్ రియాలిటీ షో కాదు. ఇందులో ఒక విప్లవాత్మకమైన మార్పు ఉంది. కేవలం కంటెస్టెంట్లు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా డబ్బు గెలుచుకోవచ్చు. ఫ్యాన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్‌ను ఎంచుకుని వారిపై `బెట్` వేయవచ్చు. ఒకవేళ ఆ కంటెస్టెంట్ గెలిస్తే, షో ప్రైజ్ మనీలో కొంత భాగం ఆ కంటెస్టెంట్‌ను సపోర్ట్ చేసిన ఫ్యాన్స్‌కు పంచుతారు.
ఈ షోలో పాల్గొనబోయే 50 మందిలో కొందరు ప్రముఖుల పేర్లు పరిశీలిస్తే క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ , ఆయన మాజీ భార్య (విడాకుల రూమర్స్ నేపథ్యంలో) ధనశ్రీ వర్మ ఇద్దరూ వచ్చే అవకాశం ఉంది. బిగ్ బాస్ మాజీలు అయిన అంకిత లోఖండే, శివ్ థాకరే, నిక్కీ తంబోలి, ప్రతీక్ సెహజ్‌పాల్ షోలో చేరతారని అంచనా. ఓర్రీ (అవ్రతమణి), ఉర్ఫీ జావేద్, శ్వేతా తివారీ, కుశా కపిల, రవి దూబే, జై భానుశాలి, మల్లికా శెరావత్ తదితరులు షోలో చేరతారని అంచనా.
బిగ్ బాస్ 19 ముగిసిన వెంటనే ఈ షోను ప్రకటించడం వల్ల దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రియాలిటీ షోల రియాలిటీ మారబోతోంది.. అని ఫరా ఖాన్ చెప్తున్న మాటలు క్యూరియాసిటీని పెంచాయి. 50 మంది ఒకే ఇంట్లో ఉంటే ఆ గొడవలు, డ్రామా ఏ స్థాయిలో వర్కవుటవుతుందో చూడాలి.
