Begin typing your search above and press return to search.

తార‌క్ నెక్స్ట్ ల్యాండ్ అయ్యేది అక్క‌డే!

దీంతో త‌దుప‌రి షెడ్యూల్ ఎక్క‌డ ఉంటుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది. హైద‌రాబాద్ లో ఉంటుందా? విదేశాలు వెళ్ల‌నున్నారా? అని ఇలా కొన్ని సందేహాలు తెరపైకి వ‌స్తున్నాయి.

By:  Tupaki Desk   |   30 Oct 2023 6:01 AM GMT
తార‌క్ నెక్స్ట్  ల్యాండ్ అయ్యేది అక్క‌డే!
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా న‌టిస్తోన్న 30వ చిత్రం 'దేవ‌ర' షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం గోవా అందాల్లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఇందులో తార‌క్..జాన్వీ స‌హాకీల‌క న‌టులంతా పాల్గొంటున్నారు. అయితే ఈ షెడ్యూల్ చాలా చిన్న‌ది. అప్ప‌టిక‌ప్పుడు అనుకోకుండా గోవాలో ప్లాన్ చేసిన షెడ్యూల్ ఇది. కేవ‌లం యూనిట్ కి సంబంధించి అతికొద్ది మంది మాత్ర‌మే షూటింగ్ లో పాల్గొంటున్నారు.

ఈ నేప‌థ్యంలో గోవా చిత్రీక‌ర‌ణ కూడా ముగింపు ద‌శ‌కు చేరుకున్న‌ట్లు స‌మాచారం. దీంతో త‌దుప‌రి షెడ్యూల్ ఎక్క‌డ ఉంటుంది? అన్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది. హైద‌రాబాద్ లో ఉంటుందా? విదేశాలు వెళ్ల‌నున్నారా? అని ఇలా కొన్ని సందేహాలు తెరపైకి వ‌స్తున్నాయి. అయితే యూనిట్ గోవా షెడ్యూల్ అనంత‌రం క‌ర్ణాట‌క‌లో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేసిన‌ట్లు యూనిట్ వ‌ర్గాల నుంచి తెలిసింది.

అక్క‌డ చిత్రీక‌రించిన కీల‌క స‌న్నివేశాలు ఉండ‌టంతో బెంగుళూరు స‌హా చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో షూటింగ్ నిర్వ‌హిస్తార‌ని తెలిసింది. ముఖ్యంగా క‌ర్ణాట‌క స‌ముద్ర తీరంలో దేవ‌ర షూటింగ్ జ‌రుగుతుంద‌ని వినిపిస్తుంది. తీర ప్రాంతం నేప‌థ్యం గ‌ల స్టోరీ కావ‌డంతో అక్క‌డ తీరంలో కొన్ని స‌న్నివేశాలు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే ద‌క్షిణాది తీరాన్ని మొత్తాన్ని దేవర చుట్టేస్తున్న‌ట్లే లెక్క‌.

వైజాగ్ స‌హా ఏపీలో ప‌లువ ప్రాంతాల్లోనూ దేవ‌ర షూటింగ్ జ‌ర‌గ‌నుంది. ఇంకా టీమ్ ఏపీకి రాలేదు. హైద‌రాబాద్ లో నే ప్ర‌త్యేకంగా సెట్లు వేసి నిర్మిస్తున్నారు. గోవా షెడ్యూల్ తోనే రియ‌ల్ లొకేష‌న్ల షూట్ మొద‌లైంది. అక్క‌డ నుంచి క‌ర్ణాక‌ట షిప్ట్ కానుంది. మ‌త్స‌కార నేప‌థ్యంలో సాగే స్టోరీ కావ‌డంతో చిత్రీక‌ర‌ణ దాదాపు ఇండియాలోనే వివిధ లొకేష‌న్ల‌లో ఉంటుంది. పాట‌లు...ఇత‌ర స‌న్నివేశాల‌కు అవ‌స‌రం అనుకుంటే విదేశాల‌కు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కొర‌టాల శివ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.