Begin typing your search above and press return to search.

ఆ స్టార్ హీరో 2024లోనూ అదే ప్లానింగ్!

స్టోరీ బేస్ట్ చిత్రంతో ప‌రిమిత బ‌డ్జెట్ లో నిర్మించి సునాయాసంగా 300 కోట్ల‌కుపై గా రాబ‌ట్టారు.

By:  Tupaki Desk   |   10 Jan 2024 4:30 PM GMT
ఆ స్టార్  హీరో 2024లోనూ అదే ప్లానింగ్!
X

2023 షారుక్ ఖాన్ నామ సంవ‌త్స‌రం అన‌డంలో అతిశ‌యోక్తి లేదు. వ‌రుస‌గా మూడు విజ‌యాలు ఖాతాలో వేసుకోవ‌డంతోనే ఇది సాధ్య‌మైంది. ప‌ఠాన్ 1000 కోట్లకు పైగా...అటుపై రిలీజ్ అయిన జ‌వాన్ కూడా 1000 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించిన సంగ‌తి తెలిసిందే. ఏడాది చివ‌ర్లో `డంకీ` తోనూ మ‌రో విజ‌యాన్ని అందు కున్నారు. ఆ సినిమా 300 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ని సాధించింది. ఇదేమి భారీ బడ్జెట్ చిత్రం కాదు. స్టోరీ బేస్ట్ చిత్రంతో ప‌రిమిత బ‌డ్జెట్ లో నిర్మించి సునాయాసంగా 300 కోట్ల‌కుపై గా రాబ‌ట్టారు.


మొత్తంగా చూస్తే 2023 లో షారుక్ ఖాన్ సినిమాలు 2500 కోట్ల వ‌ర‌కూ వ‌సూళ్లు సాధించాయి. ఈ రికార్డు కేవ‌లం షారుక్ ఖాన్ కిమాత్ర‌మే సాధ్య‌మైంది. మ‌రికొంత మంది హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి గానీ..షారుక్ ఖాన్ రేంజ్ స‌క్సెస్ ని మాత్రం అందుకోలేదు. 1000 కోట్ల లోపు వ‌సూళ్ల‌తోనే స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. మ‌రి షారుక్ ఖాన్ న్యూ ఇయ‌ర్ 2024 ని కూడా గ్రాండ్ గానే ప్లాన్ చేస్తున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది.

ఇప్ప‌టికే అట్లీతో ఓ మ‌ల్టీస్టార‌ర్ చేయ‌డానికి రెడీ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. విజ‌య్ ..షారుక్ ఖాన్ కాంబినేష‌న్ లో అట్లీ ఈ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. హిందీతో పాటు త‌మిళ్ లోనూ రూపొందించి పాన్ ఇండియాలో విడుద‌ల చేసే ప్లాన్ లో ఉన్నారు. అట్లీ ప్ర‌స్తుతం స్టోరీ సిద్దం చేస్తున్నాడు. ఇది గాక షారుక్ ఖాన్ తాజాగా విశాల్ భర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి సిద్ద‌మ‌వుతున్న‌ట్లు స‌మాచారం. ఇద్ద‌రి మ‌ధ్య సీరియ‌స్ గా డిస్క‌ష‌న్స్ సాగుతున్న‌ట్లు తెలిసింది.

అయితే ఇద్ద‌రి జ‌ర్నీ పొంత‌న లేనిది. షారుక్ ఖాన్ యాక్ష‌న్ సినిమాల‌కు పెట్టింది పేరు అయితే విశాల్ థ్రిల్ల‌ర్ సినిమాల్లో బ్రాండ్ గా ఉన్నారు. ఆయ‌న సినీ ప్ర‌పంచం షారుక్ ఇమేజ్ కి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఇద్ద‌రు క‌లిసి ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతిని పంచేలా షారుక్ ఇమేజ్...విశాల్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంతోనూ ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది.

క‌మ‌ర్శియ‌ల్ సినిమాల‌తో పాటు ప్ర‌యోగాల‌కు వెనుకాడ‌ని న‌టుడు షారుక్ ఖాన్. హిట్ వ‌చ్చినా రాక‌పోయినా ప్ర‌యోగాల విష‌యంలో షారుక్ ఎప్పుడు వెనుక‌గ‌డుగు వేయ‌రు. ఆర‌కంగా ప్ర‌యోగాల మార్కెట్ ప‌రంగా చూసుకుంటే కొంత ప్ర‌తికూల‌త ఉన్నా! కింగ్ ఖాన్ మాత్రం వెనక్కి త‌గ్గ‌రు.