Begin typing your search above and press return to search.

30 ఏళ్ల క్రితం మ్యాజిక్ మ‌ళ్లీ క్రియేట్ చేసేలా ఆ జోడీ!

సోషియా ఫాంట‌సీ చిత్రాల‌కు కీర‌వాణి అయితే ది బెస్ట్ ఇవ్వ‌గ‌ల‌రని భావించి వ‌షిష్ట కీర‌వాణిని ఎంపిక చేసారు. దీంతో చిరంజీవి-కీర‌వాణి కాంబినేష న్ లో 30 ఏళ్ల త‌ర్వాత వ‌స్తోన్న చిత్రంగా 156 నిలిచింది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 11:12 AM GMT
30 ఏళ్ల క్రితం మ్యాజిక్ మ‌ళ్లీ క్రియేట్ చేసేలా ఆ జోడీ!
X

మెగాస్టార్ చిరంజీవి-సంగీత దిగ్గ‌జం కిర‌వాణి హిట్ కాంబినేష‌న్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. `ఘరానా మొగుడు`.. `అపద్బాంధవుడు`.. `ఎస్‌.పి.పరశురామ్‌` వంటి చిత్రాలు హిట్‌ ఆల్బమ్స్ ఇచ్చిన జోడీ అది. వాటిలో పాట‌ల‌న్నీ ఓ క్లాసిక్ గా నిలాచాయి. నేటికి ఆ చిత్రాల్లో పాట‌ల్లో మార్మోమ్రోగుతూనే ఉంటాయి. అలాంటి స‌క్సెస్ పుల్ కాంబినేష‌న్ లో సినిమా వ‌చ్చి దాదాపు మూడు ద‌శాబ్ధాలు అవుతుంది.

ఇద్ద‌రు సినిమాలు చేస్తున్నా! మ‌ళ్లీ క‌లిసి ప‌నిచేసే అవ‌కాశం ఇంత‌వ‌ర‌కూ రాలేదు. చిరంజీవి త‌దుప‌రి చిత్రాల న్నింటికీ న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు సంగీత అందించారు. త‌ర్వాత కాలంలో మ‌ణిశ‌ర్మ‌.. దేవి శ్రీప్ర‌సాద్ ఎక్కువ‌గా ప‌నిచేసారు. ద‌ర్శ‌కుల అభిరుచి మేర‌కు కాంబినేష‌న్స్ మారుతూ వ‌చ్చాయి. అయితే స‌రిగ్గా మ‌ళ్లీ అదే క‌ల‌యిక‌ని యువ ద‌ర్శ‌కుడు మ‌ల్లిడి వ‌షిష్ట క‌లిపాడు. మెగాస్టార్ 156వ చిత్రానికి ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌టంతో సంగీత ద‌ర్శ‌కుడిగా కీర‌వాణిని తీసుకున్నారు.

సోషియా ఫాంట‌సీ చిత్రాల‌కు కీర‌వాణి అయితే ది బెస్ట్ ఇవ్వ‌గ‌ల‌రని భావించి వ‌షిష్ట కీర‌వాణిని ఎంపిక చేసారు. దీంతో చిరంజీవి-కీర‌వాణి కాంబినేష న్ లో 30 ఏళ్ల త‌ర్వాత వ‌స్తోన్న చిత్రంగా 156 నిలిచింది. ఈ చిత్రాన్ని కీర‌వాణా ఎంతో ప్ర‌తిష్టా త్మ‌కంగా భావిస్తున్న‌ట్లు తె లుస్తోంది. 30 ఏళ్ల క్రితం నాటి మ్యాజిక్ ని మ‌ళ్లీ క్రియేట్ చేసేలా ప‌నిచేస్తు న్న‌ట్లు క‌నిపిస్తుంది. చంద్ర‌బోస్ లాంటి ర‌చ‌యిత‌ని పెట్టుకుని పాటలు రాయిస్తున్నారు.

మ‌ళ్లీ పాత రోజుల్ని త‌ల‌పించేలా ముందుగానే రికార్డింగ్ ప‌నులు మొద‌లు పెట్టారు. ఇందులో మొత్తం ఆరు పాట‌లుం టాయ‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల కాలంలో సినిమాల్లో పాట‌లు బాగా త‌గ్గిపోయాయి. నాలుగు పాట‌లు.. మూడు పాట‌ల‌తో స‌రిపెట్టి స్టోరీని న‌డిపించ‌డంపైనే ఎక్కువ‌గా దృష్టి పెడుతున్నారు. అయితే వ‌శిష్ట మాత్రం చిరు సినిమాలో పాట‌ల‌కి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్లు తెలుస్తోంది. ది బెస్ట్ మ్యూజిక్ అందించేలా కీర‌వాణి శ్ర‌మిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న పాట‌తోనే తెలుగు సినిమాకి ఆస్కారం సాధ్య‌మైంది. ఈ చిత్రానికి ‘ముల్లోక వీరుడు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఇందులో ఎనిమిది మంది హీరోయిన్లకు ఆస్కారం ఉంద‌ని వినిపిస్తుంది.