Begin typing your search above and press return to search.

#RC16 : ఆ ఎపిసోడ్‌ చాలా స్పెషల్‌

మార్చి లేదా ఏప్రిల్‌ లో షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా బుచ్చి బాబు టీం నుంచి సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   8 Jan 2024 10:30 AM GMT
#RC16 : ఆ ఎపిసోడ్‌ చాలా స్పెషల్‌
X

రామ్‌ చరణ్ ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ పూర్తి అవ్వక ముందే బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ కొత్త #RC16 ప్రారంభం అవ్వబోతుంది. మార్చి లేదా ఏప్రిల్‌ లో షూటింగ్‌ ను ప్రారంభించబోతున్నట్లుగా బుచ్చి బాబు టీం నుంచి సమాచారం అందుతోంది.

తాజాగా ఈ సినిమాకు ఏ ఆర్‌ రెహమాన్ ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేయడం జరిగిందని యూనిట్‌ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. రెహమాన్ ను ఈ సినిమా కోసం తీసుకు రాబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

తాజాగా ఈ సినిమా గురించి జరుగుతున్న ప్రచారం ప్రకారం... ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ సినిమాకు ఆయువు పట్టు అన్నట్లుగా ఉంటుందట. ఆ ఎపిసోడ్‌ లో రామ్ చరణ్ చాలా స్పెషల్ గా కనిపిస్తాడని సమాచారం అందుతోంది. బుచ్చిబాబు కు స్క్రిప్ట్‌ వర్క్ కోసం చాలా సమయం లభించింది. దాంతో అద్భుతమైన స్క్రిప్ట్‌ ను రెడీ చేశాడట.

గేమ్ చేంజర్ సినిమా తో రామ్‌ చరణ్ ను దర్శకుడు శంకర్‌ విభిన్నంగా చూపిస్తాడనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు బుచ్చిబాబు అంతకు మించి అంటూ తన సినిమాలో చూపించాలని ఆశ పడుతున్నాడు. 2025 లో చరణ్‌, బుచ్చిబాబు సినిమా విడుదల అయ్యే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా నటింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటూ వార్తలు వచ్చాయి. మరో వైపు గేమ్‌ చేంజర్‌ హీరోయిన్ కియారా అద్వానీని ఈ సినిమా కోసం కూడా రిపీట్ చేసే ఉద్దేశ్యంతో ఉన్నారని కూడా తెలుస్తోంది. త్వరలో హీరోయిన్ విషయమై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.