Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ - వెంకీ.. అందుకే ఆగిపోయిందట

నిజానికి ఆ ప్రాజెక్టు అయితే కథ సెట్ అయినప్పటికీ చివర క్లైమాక్స్ మాత్రం అనుకున్నట్లు పేపర్ పైకి రాలేదు. నేను ఎప్పుడు కూడా అక్కడే తడబడుతూ ఉంటాను.

By:  Tupaki Desk   |   18 Oct 2023 12:50 PM GMT
తరుణ్ భాస్కర్ - వెంకీ.. అందుకే ఆగిపోయిందట
X

పెళ్లిచూపులు సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న తరుణ్ భాస్కర్ ఆ తర్వాత సురేష్ బాబు ప్రొడక్షన్ కు చాలా దగ్గర అయిపోయాడు. ఆ ప్రొడక్షన్ లో చేసిన ఈ నగరానికి ఏమైంది పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్ అయితే అందించింది. ముఖ్యంగా ఓటీటీలో ఈ సినిమా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. ఇక మళ్ళీ అదే కాంపౌండ్లో తరుణ్ భాస్కర్ కు సురేష్ బాబు మరో అవకాశం అయితే ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ముఖ్యంగా వెంకటేష్ తో ఆ మధ్య ఒక ప్రాజెక్టు కూడా చేయాలని ఫిక్స్ అయ్యారు. కథ కూడా ఓకే అయింది. అయితే చర్చల్లో ఉంది అని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేశారు అని టాక్స్ వస్తున్న కొంత కాలానికి ఆ ప్రాజెక్టు గురించి మళ్ళీ అందరూ మర్చిపోయారు. తరుణ్ భాస్కర్ కూడా నటుడిగా బిజీ కావడం అలాగే మరోవైపు వెంకటేష్, ఇతర ప్రాజెక్టులతో బిజీ కావడం వలన దాని గురించి స్పందించలేదు.

ఇక ఇప్పుడు హఠాత్తుగా రానా సపోర్టుతో మళ్ళి తరుణ్ భాస్కర్ కీడా కోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కూడా రీసెంట్ గా విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా దర్శకుడికి వెంకటేష్ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి.

దాదాపు 5 ఏళ్ల వరకు సురేష్ ప్రొడక్షన్స్ లో ఉంటూ వెంకటేష్ కోసం కథ సిద్ధం చేశారు. అయితే అది ఎందుకు సెట్స్ పైకి రాలేదు అని సందేహాలు వచ్చాయి. అయితే వెంటనే ఆ విషయంపై తరుణ్ భాస్కర్ చాలా సరదాగా సమాధానం ఇచ్చాడు. నిజానికి ఆ ప్రాజెక్టు అయితే కథ సెట్ అయినప్పటికీ చివర క్లైమాక్స్ మాత్రం అనుకున్నట్లు పేపర్ పైకి రాలేదు. నేను ఎప్పుడు కూడా అక్కడే తడబడుతూ ఉంటాను.

పర్ఫెక్ట్ క్లైమాక్స్ పర్ఫెక్ట్ సబ్జెక్టు తోనే సినిమా చేయాలని డిసైడ్ అయ్యాను. అక్కడ ఏదో ఒకటి కానీచ్చేద్దాం అనుకుంటే మళ్ళీ నన్నే తిడతారు. ఇతనికి పెద్ద హీరోలు సినిమాలో హ్యాండిల్ చేయడం సరిగ్గా రాదు అని రిమార్కులు నాకు వద్దు. అందుకే టైం తీసుకున్న కూడా మంచి సబ్జెక్టు ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా తరుణ్ భాస్కర్ అలా వివరణ ఇచ్చాడు.