Begin typing your search above and press return to search.

ENE 2.. తరుణ్ భాస్కర్ మళ్లీ బ్యాక్ స్టెప్..!

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన తరుణ్ భాస్కర్ చేసిన 3 సినిమాలతోనే తన మార్క్ చూపించారు.

By:  Tupaki Desk   |   14 Feb 2024 4:30 PM GMT
ENE 2.. తరుణ్ భాస్కర్ మళ్లీ బ్యాక్ స్టెప్..!
X

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఒకరైన తరుణ్ భాస్కర్ చేసిన 3 సినిమాలతోనే తన మార్క్ చూపించారు. పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది, కీడా కోలా ఇలా 3 సినిమాలతోనే దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలి కనబరిచాడు. డైరెక్టర్ గానే కాదు నటుడిగా కూడా తరుణ్ భాస్కర్ బిజీ బిజీ అయ్యాడు. డైరెక్టర్ తన ఫస్ట్ ప్రియారిటీ అంటున్నా యాక్టర్ గా అవకాశాలు వస్తుండటం వల్ల చేయక తప్పట్లేదని తెలుస్తుంది.

తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ నగరానికి ఏమైంది సినిమాకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ సినిమా యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. తరుణ్ భాస్కర్ కనిపిస్తే చాలు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతారు. తరుణ్ భాస్కర్ కీడా కోలా ప్రమోషన్స్ లో కూడా ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ చేయమని అందరు అడుగుతున్నారు కానీ అందుకు తగిన ఆలోచన రావట్లేదని అన్నాడు.

కీడా కోలా తర్వాత ఈ నగరానికి ఏమైంది 2 నే చేయాలని ముందు అనుకున్న తరుణ్ భాస్కర్ మళ్లీ ప్లాన్ చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నగరానికి ఏమైంది 2 చేయాలంటే విశ్వక్ సేన్ తో పాటుగా మిగతా అందరి డేట్స్ కుదరాల్సి ఉంది. అందుకే ఆ ప్లాన్ మార్చి మరో కొత్త కథతో సినిమా చేయాలని తరుణ్ భాస్కర్ ఫిక్స్ అయ్యాడట. తరుణ్ సినిమాలకు యూత్ లో క్రేజ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే. అయితే అదే అంచనాలతో వచ్చిన కీడా కోలా ఓకే అనిపించినా సినిమా జస్ట్ పాస్ అయిపోయింది.

తరుణ్ భాస్కర్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి.. ఈ నగరానికి ఏమైంది 2 ఇప్పుడు మిస్ అయినా అసలు ఆ సీక్వెల్ చేసే ఆలోచన ఉందా లేదా. తరుణ్ భాస్కర్ స్టార్ హీరోలతో సినిమాలు చేయడా అంటే.. వెంకటేష్ తో సినిమా మళ్లీ మొదటికే వచ్చిందని చెప్పుకుంటున్నారు. అయితే డైరెక్టర్ గా మంచి కథ ఆలోచన వచ్చి స్క్రిప్ట్ వర్క్ చేసే వరకు అందాక తనకు వచ్చిన సినిమా ఛాన్స్ లను చేస్తూ నటుడిగా ఫాం కొనసాగిస్తున్నాడు తరుణ్ భాస్కర్. కామెడీ సినిమాలు అందరు తీస్తారు కానీ తరుణ్ భాస్కర్ పంథా మాత్రం చాలా కొత్తగా ఉంటుంది. సహజంగా ఉంటూ తన మార్క్ సినిమాలను అందిస్తుంటాడు తరుణ్ అందుకే అతని సినిమాల మీద ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. అయితే తరుణ్ భాస్కర్ సినిమా సినిమాకు మరీ గ్యాప్ ఇవ్వకుండా వరుస సినిమాలు చేస్తే బెటర్ అని అనుకుంటున్నారు ఆడియన్స్.