Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్.. కొంతమందికోసమేనా?

కొత్తదనం కోసం ట్రై చేయడం తప్పుకాదు కాని, దానికోసం తనకున్న మార్కెట్ పరిధిని తగ్గించుకోవడం కరెక్ట్ కాదని ట్రేడ్ పండితుల మాట.

By:  Tupaki Desk   |   7 Nov 2023 4:01 AM GMT
తరుణ్ భాస్కర్.. కొంతమందికోసమేనా?
X

పెళ్లి చూపులు సినిమాతో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించిన తరుణ్ భాస్కర్ తన రెండో సినిమా కోసం ఏకంగా మూడేళ్ళు గ్యాప్ తీసుకున్నారు. ఆ చిత్రం కూడా అందరూ కొత్తవాళ్లతోనే చేసి హిట్ కొట్టాడు. మూడో సినిమా కోసం ఏకంగా ఐదేళ్ళ గ్యాప్ తీసుకొని కీడాకోలా అనే చిన్న చిత్రంతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమా కూడా బాగుందనే టాక్ వచ్చిన ఒక వర్గానికి మాత్రమే పరిమితం అయ్యింది.

ఈ సినిమాలో కూడా అందరూ కొత్తవాళ్ళనే తరుణ్ భాస్కర్ తీసుకున్నాడు. తాను కూడా ఒక లీడ్ రోల్ చేశాడు. కంప్లీట్ హైదరాబాదీ స్టైల్ లోనే ఈ సినిమా ఉంటుంది. తరుణ్ భాస్కర్ చేసిన మూడు సినిమాలు కూడా కేవలం నైజాం ఏరియా, ఓవర్సీస్ ఆడియన్స్ కి మాత్రమే రీచ్ అవుతున్నాయి. మిగిలిన వారికి పెద్దగా కనెక్ట్ కావడం లేదు. ఆ ప్రాంతాలలో ఆశించిన సక్సెస్ రేట్ రావడం లేదు.

పెళ్లి చూపులు అయితే రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యింది. తరువాత చేసిన రెండు సినిమాలు లిమిటెడ్ ఆడియన్స్ కి మాత్రమే రీచ్ అయ్యాయి. డైరెక్టర్ గా మంచి టాలెంటెడ్ అనే ప్రశంసలు అందుకుంటున్నాడు తరుణ్ భాస్కర్ మాత్రం ఒక లిమిటెడ్ ప్రేక్షకులని టార్గెట్ చేసుకొని సినిమాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. బియాండ్ ది లైన్ వచ్చి కథలు చెప్పే సత్తా ఉన్నా కూడా ఎందుకో ప్రయత్నం చేయడం లేదనే మాట ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది.

అలాగే సినిమా సినిమాకి సుదీర్ఘ గ్యాప్ తీసుకుంటున్నాడు. మూడు సినిమాల తర్వాత కూడా తరుణ్ భాస్కర్ సినిమాల మార్కెట్ వేల్యూ 5 కోట్లకి దాటలేదు ఇప్పటికైనా తరుణ్ భాస్కర్ గేర్ మార్చి కాస్తా ఫేమ్ ఉన్న హీరోలతో పాన్ ఇండియా లెవల్ లో కాకపోయినా టాలీవుడ్ లో మినిమామ్ రీచ్ అయ్యే కథలు ఎంపిక చేసుకొని సినిమాలు చేయాలని సినీ విశ్లేషకులు కోరుతున్నారు.

కొత్తదనం కోసం ట్రై చేయడం తప్పుకాదు కాని, దానికోసం తనకున్న మార్కెట్ పరిధిని తగ్గించుకోవడం కరెక్ట్ కాదని ట్రేడ్ పండితుల మాట. తరుణ్ భాస్కర్ కరెక్ట్ గా దృష్టి పెడితే డార్క్ కామెడీతో ప్రపంచ వ్యాప్తంగా రీచ్ అయ్యే కంటెంట్ లని తయారు చేయగలడనే అతనిని అభిమానించే ఆడియన్స్ కూడా బలంగా నమ్ముతున్నారు. మరి ఆ దిశలో నెక్స్ట్ సినిమాలు ట్రై చేస్తాడా లేదా అనేది చూడాలి.