Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ కీడా కోలా సందడి లేదేంటి..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తను తీసిన రెండు సినిమాలతోనే ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   19 Aug 2023 4:18 AM GMT
తరుణ్ భాస్కర్ కీడా కోలా సందడి లేదేంటి..?
X

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తను తీసిన రెండు సినిమాలతోనే ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. యూత్ ఆడియన్స్ అంతా కూడా తరుణ్ భాస్కర్ అంటే ఒక క్రేజ్ ఏర్పడేలా చేసుకున్నాడు. అయితే తను కేవలం డైరెక్టర్ గా మాత్రమే కాదు నటుడిగా కూడా ఆడియన్స్ ని అలరిస్తున్నాడు. మహానటి, ఫలక్ నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సీతారామం లాంటి సినిమాల్లో తన నటనతో మెప్పించాడు. ఈ నగరానికి ఏమైంది తర్వాత డైరెక్షన్ కన్నా యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్ ఆఫ్టర్ 5 ఇయర్స్ ఓ సినిమా చేశాడు.

కీడా కోలా అంటూ మరో డిఫరెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు తరుణ్ భాస్కర్. ఈ సినిమాలో చైతన్య రావు, తరుణ్ భాస్కర్, రవీంద్ర విజయ్, రఘురాం, బ్రహ్మానందం నటిస్తున్నారు. ఈమధ్య వచ్చిన టీజర్ సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. గ్యాప్ ఇచ్చినా సరే మరో బ్లాస్టింగ్ ప్రాజెక్ట్ తో తరుణ్ భాస్కర్ వస్తున్నాడని అనుకున్నారు. అయితే ఈ సినిమా టీజర్ టైం లో సెప్టెంబర్ 7న రిలీజ్ అనుకున్నారు. కానీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మాత్రం మొదలు పెట్టలేదు.

సెప్టెంబర్ 1న విజయ్ దేవరకొండ ఖుషి రిలీజ్ అవుతుంది. సెప్టెంబర్ 7న షారుఖ్ ఖాన్ జవాన్ వస్తుంది. ఈ రెండు సినిమాల మధ్య తరుణ్ భాస్కర్ కీడా కోలా తట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి. కీడా కోలా సినిమా విషయంలో మేకర్స్ ఆలోచన ఏంటన్నది అర్థం కావట్లేదు. సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ అవుతుందా లేదా అన్నది కూడా క్లారిటీ లేదు. ఒకవేళ సెప్టెంబర్ 7న రిలీజ్ ఉంటే మాత్రం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ఈ పాటికి మొదలు పెట్టాల్సి ఉంది. కానీ మేకర్స్ ఆ విషయంలో వెనకపడ్డారు.

తరుణ్ భాస్కర్ బ్రాండ్ నేమ్ మీద ఎలాంటి ప్రమోషన్స్ లేకపోయినా కూడా సినిమాకు మంచి ఓపెనింగ్స్ తెచ్చే అవకాశం ఉంది. రీసెంట్ గా ఈ నగరానికి ఏమైంది రీ రిలీజ్ టైం లో కూడా వసూళ్లు అదిరిపోయాయి. సో ఎలా చూసినా తరుణ్ భాస్కర్ సినిమా అంటే కచ్చితంగా ఆడియన్స్ లో అంచనాలు ఉన్నాయి. వాటికి తగినట్టుగానే కీడా కోలా ఉంటుందా అన్నది చూడాలి. నటుడిగా డైరెక్టర్ గా తరుణ్ భాస్కర్ తన సత్తా చాటుతున్నాడు. కీడా కోలా కూడా తన మార్క్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.