Begin typing your search above and press return to search.

తరుణ్ భాస్కర్ 'ది ఎండ్' స్టోరీ ఏంటి..?

యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.

By:  Tupaki Desk   |   10 Jun 2025 11:30 PM
తరుణ్ భాస్కర్ ది ఎండ్ స్టోరీ ఏంటి..?
X

యంగ్ డైరెక్టర్స్ లో తనకంటూ ఒక స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్. అతను చేసిన పెళ్లిచూపులు సినిమా సెన్సేషన్ కాగా ఆ నెక్స్ట్ వచ్చిన ఈ నగరానికి ఎమైంది అదరగొట్టేసింది. యూత్ ఆడియన్స్ పల్స్ పట్టేసిన తరుణ్ భాస్కర్ డైరెక్టర్ తను తీసే ప్రతి సినిమాతో యూత్ ని ఊగిపోయేలా చేస్తున్నాడు. చివరగా తన డైరెక్షన్ లో వచ్చిన కీడా కోలా సినిమా అంచనాలను అందుకోలేదు కానీ తరుణ్ భాస్కర్ మార్క్ అయితే చూపించింది.

ఐతే డైరెక్టర్ గా కాస్త స్లో అయ్యి నటుడిగా బిజీ అయ్యాడు తరుణ్ భాస్కర్. తెర మీద కనిపించడం ఎక్కువయ్యే సరికి తెర వెనక దర్శకుడి పాత్రకు అన్యాయం జరుగుతుంది. అందుకే కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ డైరెక్షన్ వైపు దృష్టి పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. కీడా కోలా సినిమా కూడా తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లోనే వచ్చింది. ఆ సినిమాలో తరుణ్ నటించడం విశేషం.

ఇక నెక్స్ట్ తరుణ్ భాస్కర్ ఏ సినిమాతో వస్తాడు అన్నది పెద్ద చర్చ నడుస్తుంది. ఐతే ఎప్పటి నుంచో ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 చేయాలని ఫ్యాన్స్ అడుగుతుండగా ఈమధ్య తరుణ్ చేస్తానని చెప్పాడు. లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ తన ఇన్ స్టాగ్రాం లో లాప్టాప్ లో ది ఎండ్ అంటూ ఒక నోట్ రాశాడు. దానికి న్యూ బిగినింగ్ అనే కామెంట్ పెట్టాడు. తరుణ్ భాస్కర్ కథ పూర్తి చేశానన మెసేజ్ ఆడియన్స్ కి పాస్ చేశాడు.

ఐతే అది ఏ కథ ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ స్టోరీనేనా అని సోషల్ మీడియాలో చర్చలు పెడుతున్నారు. ఈ.ఎన్.ఈ 2 కోసం యూత్ ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే తరుణ్ పూర్తి చేసిన కథ అదే అయితే మాత్రం త్వరలోనే ఒక సర్ ప్రైజ్ అప్డేట్ ఉంటుందని చెప్పొచ్చు. ఈ నగరానికి ఎమైంది 2 కాకుండా తరుణ్ భాస్కర్ వేరే కథను సిద్ధం చేసినా అలా అయినా తరుణ్ సినిమా మళ్లీ చూడొచ్చనే జోష్ లో ఉన్నారు ఆడియన్స్. మొత్తానికి తరుణ్ భాస్కర్ ది ఎండ్ స్టోరీ ఏంటో కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ డిస్కషన్స్ జరుగుతున్నాయి.