నేను మారకపోతే చెంప దెబ్బ కొట్టండి: డైరెక్టర్
పురుషాహంకార ప్రపంచంపై మహిళా సాధికారత ఆధిపత్యానికి చెల్లు చీటీ పలికి చాన్నాళ్లయింది.
By: Tupaki Desk | 7 April 2025 8:46 AM ISTపురుషాహంకార ప్రపంచంపై మహిళా సాధికారత ఆధిపత్యానికి చెల్లు చీటీ పలికి చాన్నాళ్లయింది. పితృ స్వామ్య వ్యవస్థ ప్రభావం ఇంకా అక్కడక్కడా ఉన్నా కానీ చాలా చోట్ల ఇది వర్కవుట్ కావడం లేదు. మహిళల్లో నేడు చాలా పరివర్తన వచ్చింది. ప్రతిదీ ప్రశ్నిస్తున్నారు. ఇంచుమించు ఇదే తరహా కథాంశం తో తెరకెక్కించిన తాపడ్ తాప్సీకి మంచి పేరు తెచ్చి పెట్టింది. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమా చెంపదెబ్బ కొట్టిన తర్వాత స్వయంప్రతిపత్తి కోసం ఒక మహిళ ఎలాంటి ప్రయత్నం చేసిందనేదే సినిమా. పితృస్వామ్య సాంఘికీకరణ.. వ్యవస్థాగత లైంగికత ప్రభావం సమాజంలో ఎలా ఉందో తెరపై ఆవిష్కరించారు.
తాజాగా ప్రముఖ దర్శకుడు హన్సల్ మెహతా తాప్పడ్ సినిమా చూసాక తాను పూర్తిగా పరివర్తన చెందానని అంగీకరించారు. తన మాజీ భార్య సహా మహిళలకు అతడు క్షమాపణలు చెప్పాడు. ఒక బహిరంగ లేఖలో మెహతా ఇలా రాసాడు. ``నా రైట్ మీ ఎదుగుదలను అణచివేసినట్లయితే క్షమించండి. నేను ఒక మూర్ఖుడిని అయితే క్షమించండి. నేను మారడానికి ప్రయత్నిస్తాను. నేను మారకపోతే నన్ను చెంపదెబ్బ కొట్టండి`` అని అన్నాడు. తాప్పడ్ చూశాక తనలో ఈ మార్పు మొదలైందని , తాను ఇలా క్షమాపణలు చెప్పి ఉండేవాడిని కాదని ఒప్పుకున్నాడు.
నిజానికి మంచి సందేశం ఉన్న సినిమాలను ప్రజల ముందుకు తేగలిగితే అవి వారిలో మార్పును తేగలవు. కానీ కమర్షియల్ సినిమా పేరుతో అసభ్యతను ప్రజల్లోకి తెస్తున్నారనే విమర్శలున్నాయి. తప్పాడ్ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా వ్యక్తిగత బాధ్యత అవసరాన్ని నొక్కి చెప్పింది. పితృస్వామ్య వ్యవస్థలోని లోపాలను, సంఘంలో అనైతికతను కూడా ఈ సినిమా ఎత్తి చూపింది.