Begin typing your search above and press return to search.

విక్రం తంగళాన్ అనుకున్నదే జరిగింది..!

విక్రమ్ నటించిన సినిమాలపై క్రేజ్ అయితే బాగానే వస్తుంది కానీ సినిమాల రిలీజ్ ల పోస్ట్ పోన్ వల్ల సినిమాలపై ఏర్పడ్డ ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది

By:  Tupaki Desk   |   16 Jan 2024 7:09 AM GMT
విక్రం తంగళాన్ అనుకున్నదే జరిగింది..!
X

కోలీవుడ్ లో స్టార్ హీరోలంతా కూడా సూపర్ ఫాం లో ఉండి వరుస సక్సెస్ లను అందుకుంటుంటే చియాన్ విక్రం మాత్రం ఇంకా హిట్ కోసం తపించిపోతున్నాడు. విక్రం ప్రస్తుతం పా రంజిత్ డైరెక్షన్ లో తంగళాన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మరోసారి తన వర్సటాలిటీని చూపించాలని ఫిక్స్ అయ్యాడు విక్రమ్. సినిమా నుంచి వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా సినిమాకు ఆ టీజర్ తోనే కావాల్సినంత బజ్ క్రియేట్ చేశారు. సినిమా టీజర్ తో పాటుగా పోస్టర్స్ కూడా తంగళాన్ పై బజ్ పెంచాయి. అయితే సినిమా రిలీజ్ ల విషయంలో మాత్రం చియాన్ విక్రమ్ కు బ్యాడ్ టైం కొనసాగుతుంది.

విక్రమ్ నటించిన సినిమాలపై క్రేజ్ అయితే బాగానే వస్తుంది కానీ సినిమాల రిలీజ్ ల పోస్ట్ పోన్ వల్ల సినిమాలపై ఏర్పడ్డ ఆ ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. లేటెస్ట్ గా తంగళాన్ విషయంలో అలా జరగకూడదని బాగా ట్రై చేశారు. అటు విక్రం ఇటు పా రంజిత్ కాంబో అనగానే తంగళాన్ మీద భారీ హైప్ వచ్చింది. ప్రచార చిత్రాలు ఆ హైప్ కి సపోర్ట్ చేశాయి. సినిమాను ముందు 2023 డిసెంబర్ రిలీజ్ అనుకున్నారు అది కుదరక సంక్రాంతికి అనుకున్నారు అది కాక జనవరి 26 రిపబ్లిక్ డే రిలీజ్ అని లాక్ చేశారు.

ఇప్పుడు జనవరి 26 నుంచి కూడా సినిమా వాయిదా పడినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమాను ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నారట. అయితే ఏప్రిల్ లో రిలీజ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమాలో విక్రమ్ డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న విషయం తెలిసిందే. శివపుత్రుడు వైబ్స్ తో కనిపిస్తున్న తంగళాన్ సినిమా చియాన్ విక్రమ్ కు ఆ సినిమా రేంజ్ సక్సెస్ అందిస్తుందని ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు.

కబాలితో పా రంజిత్ పేరు సౌత్ ఇండియానే కాదు పాన్ ఇండియా వైడ్ మారుమోగింది. రజినిని వింటేజ్ లుక్ తో అదరగొట్టేలా చూపించిన పా రంజిత్ చియాన్ విక్రమ్ తో ఒక వెరైటీ కథతో వస్తున్నారు. ఈ సినిమాలో విక్రమ్ సరసన మాళవిక మోహనన్ నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమాలో అందరు డ్రీ గ్లామరస్ లుక్ తో కనిపించనున్నారు. సినిమా కోసం చియాన్ ఫ్యాన్స్ అంతా కూడా ఈగర్ గా ఎదురుచూస్తుండగా అది మళ్లీ మళ్లీ లేట్ అవుతూ వస్తుంది. మరి ఈ సినిమాతో విక్రమ్ అనుకున్న రేంజ్ సక్సెస్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.