Begin typing your search above and press return to search.

తంగలాన్ రిలీజ్ పై డైరెక్టర్ కామెంట్..!

మళ్లీ చిత్ర యూనిట్ సినిమా ఏప్రిల్ రిలీజ్ అని రిలీజ్ డేట్ చెప్పారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో పా రంజిత్ తంగలాన్ సినిమా రిలీజ్ పై మరో మాట చెప్పారు.

By:  Tupaki Desk   |   14 March 2024 4:05 AM GMT
తంగలాన్ రిలీజ్ పై డైరెక్టర్ కామెంట్..!
X

చియాన్ విక్రమ్ పా రంజిత్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా తంగలాన్. విక్రం మరోసారి విలక్షణమైన పాత్రలో నటించిన ఈ తంగలాన్ సినిమా పూర్తయ్యి చాలా రోజులు అవుతున్నా రిలీజ్ కి మోక్షం కలగట్లేదు. సినిమా ప్రచార చిత్రాలు అంచనాలు పెంచగా చియాన్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అసలైతే సినిమాను లాస్ట్ ఇయర్ డిసెంబర్ లోనే రిలీజ్ చేయాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల ఫిబ్రవరికి వాయిదా వేశారు.

మళ్లీ చిత్ర యూనిట్ సినిమా ఏప్రిల్ రిలీజ్ అని రిలీజ్ డేట్ చెప్పారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యూలో పా రంజిత్ తంగలాన్ సినిమా రిలీజ్ పై మరో మాట చెప్పారు. సినిమా ఏప్రిల్ కు వస్తుందని ఫ్యాన్స్ కు నిరాశ తప్పేలా లేదు. ఇంతకీ పా రంజిత్ ఏమన్నారు అంటే తంగలాన్ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తంది. రిలీజ్ కు సిద్ధంగా ఉంది. సెన్సార్ సర్టిఫికెట్ కు అప్లై చేస్తున్నాం. ప్రజెంట్ ఎన్నికల తేదీల ప్రకటన కోసం వెయిట్ చేస్తున్నాం. ఎలక్షన్స్ పూర్తయ్యాక సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు పా రంజిత్. అంతేకాదు ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.

పా రంజిత్ ఈ సినిమాను కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల నేపథ్యంతో తెరకెక్కించారు. శివ పుత్రుడు తరహాలో విక్రం డిఫరెంట్ లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. సినిమాలో మలయాళ భామ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించగా పార్వతి తిరువోతు కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. కోలీవుడ్ స్టార్ హీరోలంతా సూపర్ ఫాం కొనసాగిస్తుండగా విక్రం ఒక్కడే వెనకపడ్డాడు. మళ్లీ చియాన్ తిరిగి ఫాం లోకి రావాలని ఆయన ఫ్యాన్స్ కోరుతున్నారు.

అయితే సినిమా రిలీజ్ డేట్స్ వల్ల విక్రం అభిమానులు నిరుత్సాహ పడుతున్నారు. ఒక సినిమా రెండు మూడుసార్లు రిలీజ్ వాయిదా పడటం వల్ల ఆ సినిమాపై నెగిటివ్ ఇంపాక్ట్ ఏర్పడుతుంది. అయితే పా రంజిత్ మాత్రం ఎప్పుడొచ్చినా సరే తంగలాన్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని చెబుతున్నారు. డైరెక్టర్ గా పా రంజిత్ ప్రతిభ గురించి తెలిసిందే మరి విక్రం తో చేసిన తంగలాన్ తో పా రంజిత్ ఏమేరకు ప్రేక్షకులను అలరిస్తారన్నది చూడాలి.