Begin typing your search above and press return to search.

తండేల్ రిలీజ్ డేట్ ట్విస్ట్.. అసలు ఊహించలేదు!

డిసెంబర్ 20 అయితే పర్ఫెక్ట్ డేట్ అని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం.

By:  Tupaki Desk   |   17 April 2024 4:27 PM GMT
తండేల్ రిలీజ్ డేట్ ట్విస్ట్.. అసలు ఊహించలేదు!
X

నాగచైతన్య కెరీర్ లోనే గతంలో ఎప్పుడు లేనంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రం తండేల్. నిజ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా దర్శకుడు చందు మొండేటి ఈ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాపై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ అయితే చాలా నమ్మకంతో ఉన్నారు.

ఎందుకంటే ఈ సినిమా కోసం ముందుగానే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రత్యేకంగా వర్క్ షాప్ లో కూడా పాల్గొని రియాల్టీకి దగ్గరగా ఉండేలా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ లో బందీలుగా మారిన మత్స్యకారుల జీవిత ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక హీరో నాగచైతన్య లుక్కు కూడా ఇందులో నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతున్నట్లు అర్థమవుతుంది.

ఇక సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే తండేల్ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఇదివరకే చాలా రకాల గాసిప్స్ వైరల్ అయ్యాయి. సినిమాను ఆగస్టులోనే విడుదల చేయాలని అనుకున్నారు. ముఖ్యంగా ఆగస్టు 15వ తేదీన బెస్ట్ డేట్ అనుకున్నప్పటికీ అదే సమయంలో పుష్ప 2 సినిమా గ్రాండ్ గా విడుదల అవుతూ ఉండడంతో మళ్ళీ చర్చల దశలోనే నిర్ణయాలను మార్చుకున్నారు.

దసరా టైంలో కూడా విడుదల చేయాలని ఆలోచనకు వచ్చినప్పటికీ మళ్లీ దర్శక నిర్మాతలు కొత్త ప్రణాళికను రచించినట్లుగా తెలుస్తోంది. పర్ఫెక్ట్ టైమింగ్ లోనే ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అంతే కాకుండా పాన్ ఇండియా రేంజ్ కు తగ్గ కంటెంట్ కాబట్టి అందరికీ చేరువయ్యేలా గ్రాండ్ గా విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు.

ఇక లేటెస్ట్ గా వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. డిసెంబర్ 20 అయితే పర్ఫెక్ట్ డేట్ అని ఇటీవల ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. ఈ విషయంలో అధికారికంగా క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు. త్వరలోనే ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

తండేల్ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా సోషల్ మీడియాలో పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఎంతో అట్రాక్ట్ చేస్తుంది. తప్పకుండా ఇందులో ఉండే ఎలిమెంట్స్ ప్రతి ఇండియన్ కి కనెక్ట్ అవుతాయని అర్థమవుతుంది దర్శకుడు చందు ఇప్పటికే కార్తికేయ 2 సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు అందుకున్నాడు. ఈ సినిమాకు నార్త్ లో కూడా మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది. మరి కంటెంట్ తో బాక్సాఫీస్ వద్ద ఈ కాంబినేషన్ ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.