Begin typing your search above and press return to search.

తండేల్ ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్..!

తండేల్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది.

By:  Tupaki Desk   |   27 Feb 2024 8:44 AM GMT
తండేల్ ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్..!
X

అక్కినేని ఫ్యామిలీ ఫాం లో ఉన్న హీరో యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం తను చేస్తున్న తండేల్ సినిమా మీద సూపర్ ఫోకస్ గా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని తెలుస్తుంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది. తండేల్ సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను ఏర్పరచింది.

ఈ సినిమా పై పెరుగుతున్న అంచనాలకు తగినట్టుగానే బిజినెస్ కూడా చేస్తుంది. తండేల్ సినిమా ఓవర్సీస్ రైట్స్ డీల్ క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ప్రత్యంగిరా సినిమాస్ వారు తండేల్ ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారట. భారీ రేటుకే వీరు తండేల్ హక్కులను సొంతం చేసుకున్నట్టు తెలుస్తుంది.

తండేల్ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటుగా హిందీలో కూడా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. నాగ చైతన్య కెరీర్ లో చేస్తున్న మొదటి పాన్ ఇండియా సినిమాగా తండేల్ సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంది. ఈ సినిమా విషయంలో మేకర్స్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారట. కథ డిమాండ్ మేరకు సినిమాలో కొన్ని సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి విజువల్ ఫీస్ట్ అందిస్తాయని అంటున్నారు.

నాగ చైతన్య కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తున్న తండేల్ ప్రీ రిలీజ్ బజ్ తోనే సినిమాపై ఒక మంచి పాజిటివ్ వైబ్ ఏర్పడుతుంది. ఆల్రెడీ లవ్ స్టోరీతో హిట్ అందుకున్న ఈ జోడీ మరోసారి అంతకుమించిన రిజల్ట్ అందుకోవాలని చూస్తున్నారు. సినిమా రిలీజ్ డేట్ విషయంపై క్లారిటీ తో పాటుగా సినిమా నుంచి మరో టీజర్ కూడా త్వరలో వస్తుందని తెలుస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా తండేల్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.

సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపిస్తాడని తెలుస్తుంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా వైడ్ హిట్ అందుకున్న చందు మొండేటి మరోసారి తండేల్ తో తన సత్తా చాటాలని చూస్తున్నాడు. తండేల్ సినిమాపై నాగ చైతన్య కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం చైతు మేకోవర్ అక్కినేని ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని అంటున్నారు.