Begin typing your search above and press return to search.

తండేల్..ఓపెనింగ్ సాంగ్ అంటే ఎలా ఉండాలి

ఈ నేపథ్యంలో చైతూ.. యాంకర్ చందుతో కాల్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   13 Feb 2024 5:13 AM GMT
తండేల్..ఓపెనింగ్ సాంగ్ అంటే ఎలా ఉండాలి
X

కెరీర్‌ స్టార్టింగ్ నుంచి కథాంశాల్లో వైవిధ్యానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు యువ హీరో అక్కినేని నాగ చైతన్య. తాజా చిత్రం తండేల్‌ లో ఆయన జాలరి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో గీతా ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సాయిపల్లవి హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది.

ఇక ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్‌ ఇటీవలే పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. సాయి పల్లవితో పాటు ప్రధాన తారాగణంపై ఇంపార్టెంట్ సీన్స్ షూట్ చేశామని చెప్పారు. దాంతో పాటు వర్కింగ్ స్టిల్స్ ను కూడా షేర్ చేశారు. ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు మేకర్స్. వర్కింగ్ స్టిల్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. హీరోహీరోయిన్లు కూడా నేచురల్ గా కనిపించారు.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారట. అందులో భాగంగా హీరో ఎంట్రీ సాంగ్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైతూ.. యాంకర్ చందుతో కాల్ మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"చందూ హాయ్.. ఆ సాంగ్ ట్యూన్ ఓకే కదా.. మాస్ పాట కావాలని చెప్పా కదా.. ఓపెనింగ్ సాంగ్ అంటే ఎలా ఉండాలి.. కమర్షియల్, మాస్ గా ఉండాలి.. హమ్మింగ్ అంటావ్.. ట్యూన్ అంటావ్" అని చైతూ.. చందూతో మాట్లాడారు. దీని బట్టి చూస్తే త్వరలోనే తండేల్ మూవీ నుంచి ఫుల్ మాస్ యాక్షన్ లో హీరో ఎంట్రీ సాంగ్ రానుందన్నమాట. ఈ వీడియో చూసిన అక్కినేని ఫ్యాన్స్.. సాంగ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులు.. 2018 నవంబర్‌ లో గుజరాత్‌ లో సముద్రంలో చేపల వేటకు వెళ్లగా.. వారిని పాకిస్థాన్ దళాలు తీసుకెళ్లి జైల్లో బంధిస్తాయి. ఆ తర్వాత వారిని విడిపించేందుకు పాకిస్థాన్ ప్రభుత్వంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చర్చలు జరిపింది. చివరికి 2020 జనవరిలో ఆ మత్స్యకారులను పాక్ విడుదల చేసింది. ఈ ఘటనల నేపథ్యంలోనే తండేల్ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. మరి ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.