Begin typing your search above and press return to search.

తండెల్.. ఆ రెండు టార్గెట్లలో ఏదో ఒకటి?

సముద్రంలో చేపల వేటకి వెళ్లిన ఉత్తరాంధ్ర మత్యకారులు పాకిస్థాన్ చెరలో ఎలా బందీ అయ్యారు.

By:  Tupaki Desk   |   23 March 2024 4:45 AM GMT
తండెల్.. ఆ రెండు టార్గెట్లలో ఏదో ఒకటి?
X

అక్కినేని నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని ఏకంగా 60 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. పీరియాడికల్ జోనర్ లో ఉత్తరాంధ్ర మత్స్యకారుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతోంది.

సముద్రంలో చేపల వేటకి వెళ్లిన ఉత్తరాంధ్ర మత్యకారులు పాకిస్థాన్ చెరలో ఎలా బందీ అయ్యారు. అక్కడి నుంచి మళ్ళీ ఎలా బయటకి వచ్చారు ఈ మూవీలో చూపించబోతున్నారంట. కథ నేపథ్యం అంతా శ్రీకాకుళంలో నడవనున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా నాగ చైతన్య కెరియర్ లోనే తండేల్ బెస్ట్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చైతన్య సినిమా కోసం ప్రత్యేకంగా లోకల్ వారితో మాట్లాడడం వారి జీవన శైలిని గురించి తెలుసుకోవడం వంటివి చేశాడు.

కార్తికేయ 2 లాంటి సూపర్ హిట్ తర్వాత చందూ మొండేటి ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో ఆవిష్కరిస్తూ ఉండటంతో ఒక హైప్ క్రియేట్ అయ్యి ఉంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకి వచ్చిన టైటిల్, క్యారెక్టర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దేశభక్తిని పెంచే పవర్ ఫుల్ ఎలిమెంట్స్ సినిమాలో ఉన్నట్లు స్పష్టం అయ్యింది. అంతర్లీనంగా ప్రేమకథని కూడా చూపించబోతున్నారంట.

సాయి పల్లవి ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె క్యారెక్టర్ మత్యకార వర్గానికి చెందిన అమ్మాయిగా ఉండబోతోంది. నాగచైతన్య సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టొరీ మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తండెల్ కథ అంతకంటే భిన్నంగా ఉండబోతోంది. బలమైన క్యారెక్టర్ కాబట్టి సాయి పల్లవిని లీడ్ రోల్ లో తీసుకున్నారు.

ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టూ బ్యాక్ షెడ్యూల్స్ తో ఈ సినిమా షూటింగ్ ని చందూ మొండేటి కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. దీంతో రిలీజ్ డేట్ పై ప్రస్తుతం చిత్ర యూనిట్ ఫోకస్ పెట్టింది. అక్టోబర్ నెలలో మూవీని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నారంట. మొదట సమ్మర్ చివరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. కానీ ప్లాన్ వర్కౌట్ కాలేదు.

ఇక అక్టోబర్ 11 లేదంటే అదే నెల 31 తేదీలలో ఎదో ఒకటి ఖరారు చేసే అవకాశం ఉంది. అయితే అదే సమయంలో దేవర సినిమా కూడా రాబోతోంది. ఈ పోటీ కాస్త రిస్క్ కాబట్టి ఆ నెల చివరలో సోలోగా వచ్చే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ తో ఉంది. కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. నాగ చైతన్య చివరిగా థాంక్యూ మూవీతో డిజాస్టర్ అందుకున్నాడు. అయితే డిజిటల్ ఎంట్రీ ఇచ్చి దూత వెబ్ సిరీస్ తో సక్సెస్ ని ఖాతాలో వేసుకున్నాడు. తండేల్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారే ప్రయత్నంలో ఉన్నారు.