Begin typing your search above and press return to search.

తండేల్ ఎప్పుడొచ్చినా దుమ్ము దుమారమేనా..!

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నారు.

By:  Tupaki Desk   |   17 Feb 2024 2:45 AM GMT
తండేల్ ఎప్పుడొచ్చినా దుమ్ము దుమారమేనా..!
X

నాగ చైతన్యతో ప్రేమమ్, సవ్యసాచి సినిమాలు చేసిన చందు మొండేటి హ్యాట్రిక్ మూవీగా తండేల్ ని చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ 2లో బన్నీ వాసు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. నాగ చైతన్యకి జతగా సాయి పల్లవి నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నారు.

ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమాను 2025 సంక్రాంతికి తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్. ఆల్రెడీ సంక్రాంతి అంటే స్టార్ సినిమాల మధ్య పోటీ ఊహించడం కామన్. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఐతే విశ్వంభర జనవరి 10నే రిలీజ్ చేసేలా ప్లాన్ ఉందని టాక్. ప్రభాస్ మారుతి కాంబోలో వస్తున్న రాజా సాబ్ సినిమా కూడా సంక్రాంతికే ఫిక్స్ అని నిర్మాతల్ చెబుతున్నారు.

తండేల్ ని కూడా పొంగల్ ఫైట్ లో దించాలని మేకర్స్ ప్లాన్. అయితే కంటెంట్ బేస్డ్ సినిమాలు ఎప్పుడొచ్చినా సరే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజైనా సరే ఏ సినిమాకు ఉండే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఆ సినిమాకు ఉంటుంది. సో తండేల్ విషయంలో కూడా అదే జరగబోతుందని చెప్పొచ్చు. తండేల్ ఎప్పుడు వచ్చినా సరే ఆడియన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్.

నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తున్న తండేల్ సినిమాలో అతని పర్ఫార్మెన్స్ కూడా నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటుందని టాక్. ఆల్రెడీ సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా హిట్ అందుకున్న నాగ చైతన్య మరోసారి తండేల్ తో ఆ హిట్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. కార్తికేయ 2 తర్వాత చందు మొండేటి చేస్తున్న ఈ తండేల్ ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. సబ్జెక్ట్ బాగా రావడం వల్లే సినిమాపై మేకర్స్ అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారని అర్థమవుతుంది. సో రిలీజ్ ఎప్పుడైనా తండేల్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అని అంటున్నారు. మరి సినిమా నిజంగానే ఆ రేంజ్ లో ఉంటుందా లేదా అన్నది చూడాలి.