Begin typing your search above and press return to search.

రికార్డు రేటుకు తండేల్ రైట్స్.. చైతూ కెరీర్ లోనే ఫస్ట్ టైమ్

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు

By:  Tupaki Desk   |   29 April 2024 7:52 AM GMT
రికార్డు రేటుకు తండేల్ రైట్స్.. చైతూ కెరీర్ లోనే ఫస్ట్ టైమ్
X

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య.. రిజల్ట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. అన్ని రకాల జోనర్లను టచ్ చేస్తూ ఆకట్టుకుంటున్నారు. చివరగా ధూత వెబ్ సిరీస్ తో అలరించిన చైతూ.. ప్రస్తుతం తండేల్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్రకు చెందిన కొందరు మత్స్యకారుల నిజ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు చందూ మొండేటి గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.

గీతా ఆర్ట్స్ బ్యానర్‌ పై స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, టీజర్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినీ ప్రియుల్లో భారీ హైప్ కూడా క్రియేట్ అయింది.

అయితే ఈ సినిమా.. విడుదలకు ముందే డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల డీల్ ను పూర్తి చేసుకుంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ సంస్థ తండేల్ సినిమా హక్కులను భారీ పోటీ మధ్యలో దక్కించుకుంది. రూ.40 కోట్లు చెల్లించి మరీ ఓటీటీ హక్కులను కొనుగోలు చేసింది. నాగ చైతన్య కెరీర్ లో ఓ సినిమాకు ఓటీటీ రైట్స్ ద్వారా ఇన్ని కోట్లు రావడం ఇదే తొలిసారి. ఈ మూవీతో చైతూ అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు.

అయితే చందూ మొండేటి లాస్ట్ సినిమా కార్తికేయ-2.. తెలుగుతో పాటు పాన్ ఇండియా లెవెల్ లో భారీ విజయం సాధించింది. ఇక చైతూ కూడా వైవిధ్యమైన సినిమాలు చేస్తారనే పేరు ఉంది. గీతా ఆర్ట్స్ అతిపెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటి. ఈ అంశాలన్నీ తండేల్‌ కు రికార్డు స్థాయిలో ఓటీటీ డీల్ జరగడానికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. నాగ చైతన్యతో పాటు లీడ్ రోల్స్ చేస్తున్న వారిపై కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీ కోసం చైతూ శ్రీకాకుళం యాసలో ఫస్ట్ టైమ్ మాట్లాడనున్నారు. అందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు. కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ తో పాటు ప్రతి విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. మరి ఈ మూవీ ఆయనకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి.