Begin typing your search above and press return to search.

తండేల్ డేరింగ్ కి రీజన్ అదేనా..?

అయితే పోటీగా తారక్ వస్తున్నా తండేల్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదని టాక్. కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే తండేల్ దసరా ఫైట్ లో నిలుస్తుందని చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   11 March 2024 1:30 AM GMT
తండేల్ డేరింగ్ కి రీజన్ అదేనా..?
X

కొన్ని కాంబినేషన్ లో సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే ఆ ప్రాజెక్ట్ మీద భారీ హైప్ వచ్చేస్తుంది. డైరెక్టర్ హీరో కలయిక కావొచ్చు వారు ముందు చేసిన సినిమాలు ఇంపాక్ట్ కావొచ్చు మళ్లీ కలిసి సినిమా వస్తుంది అంటే ఎక్కడ లేని అంచనాలు ఏర్పడతాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలతో వస్తున్న సినిమానే తండేల్. అక్కినేని నాగ చైతన్య, చందు మొండేటి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా ఆడియన్స్ లో మంచి బజ్ ఏర్పడేలా చేశారు మేకర్స్.

గీతా ఆర్ట్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది. కార్తికేయ 2 సక్సెస్ తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ తెచ్చుకున్న చందు మొండేటి ఈసారి తండేల్ తో నేషనల్ లెవెల్ లో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. శ్రీకాకుళం నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ చైతన్య ఫిషర్ మెన్ గా కనిపించనున్నాడు.

సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ లో ఒక పక్క ప్రేమ.. మరోపక్క దేశభక్తి ఇలా అన్ని అంశాలు టచ్ చేసేలా కనిపిస్తున్నాయి. ఆడియన్స్ ని మెప్పించడంలో అసలు టార్గెట్ మిస్ అవ్వకుండా పర్ఫెక్ట్ కాలిక్యులేషన్స్ తో తండేల్ వస్తుందని తెలుస్తుంది. సినిమాలో నాగ చైతన్య క్యారెక్టరైజేషన్.. ఆయన పర్ఫార్మెన్స్ రెండు స్పెషల్ డిస్కషన్ చేసేలా ఉంటాయని అంటున్నారు. సినిమాలో సాయి పల్లవి నటించడం మరో హైలెట్ అని అంటున్నారు.

ఈ లెక్కలన్నీ కూడా తండేల్ పై భారీ హైప్ తెస్తున్నాయి. అందుకే ఈ సినిమా దసరా బరిలో దించే ప్లానింగ్ లో ఉన్నారు. దసరా కి ఎన్.టి.ఆర్ దేవర పార్ట్ 1 రిలీజ్ లాక్ చేసుకున్నాడు. అక్టోబర్ 10న దేవర 1 వస్తుంది. అయితే పోటీగా తారక్ వస్తున్నా తండేల్ ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదని టాక్. కంటెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తోనే తండేల్ దసరా ఫైట్ లో నిలుస్తుందని చెబుతున్నారు. తండేల్ డేరింగ్ వెనుక వారి సినిమా మీద ఉన్న నమ్మకమని తెలుస్తుంది. దసరా ఫైట్ లో అక్టోబర్ 10న దేవర వస్తుండగా ఒక రోజు ఆగి అక్టోబర్ 11న నాగ చైతన్య తండేల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో మ్యాటర్ ఉంటే ఫెస్టివల్ సీజన్ ఎన్ని సినిమాలు వచ్చినా సరే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు. మరి తండేల్ పై మేకర్స్ పెట్టుకున్న నమ్మకం ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.