తండేల్.. టీవీలో కూడా అదే జాతర!
తాజా సమాచారం ప్రకారం తండేల్ ఈ టీవీ ప్రసారంలో 10.32 TRP రేటింగ్‌ను నమోదు చేసింది.
By: Tupaki Desk | 10 July 2025 10:01 PM ISTనాగ చైతన్య కెరీర్‌లో అత్యుత్తమ సినిమాగా నిలిచింది "తండేల్". వరుస ఫెయిల్యూర్ల తరువాత ఈ సినిమాతో ఓ మాస్ ఆడియెన్స్ ఫోకస్ మళ్లీ ఆయన వైపు మళ్ళింది. దేశభక్తితో వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాను దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. ఇక తనదైన మార్క్‌లో చందు ఎమోషన్ ను బాగా హైలెట్ చేయడంతో థియేటర్స్‌లో మంచి రెస్పాన్స్ అందుకుంది. 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి నాగచైతన్య కెరీర్‌లోనే పెద్ద హిట్‌గా నిలిచింది.
ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కథానాయికగా తన నటనతో ఆకట్టుకుంది. చందూ మొండేటి దర్శకత్వం, గీతా ఆర్ట్స్ బ్యానర్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, రియల్ స్టోరీ ప్రేరణతో రూపొందిన తండేల్ ప్రేక్షకులను థియేటర్స్‌లో మాత్రమే కాకుండా టీవీ వరల్డ్ లో కూడా ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే ఎమోషనల్ కంటెంట్, చైతన్య సాయి పల్లవి జంట మధ్య కెమిస్ట్రీ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయింది.
ఇప్పటికే థియేటర్‌లలో హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఇటీవల జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారమైంది. తాజా సమాచారం ప్రకారం తండేల్ ఈ టీవీ ప్రసారంలో 10.32 TRP రేటింగ్‌ను నమోదు చేసింది. ఇది 2025లో టెలికాస్ట్ అయిన తెలుగు సినిమాల్లో మూడవ అత్యధిక TRP. ప్రస్తుత పరిస్థితుల్లో టీవీలలో సినిమాలకు పెద్దగా రెస్పాన్స్ లేకపోతున్నా, తండేల్ మాత్రం మంచి మార్క్ సాధించింది.
ఇప్పటికే టీవీలో ప్రసారమైన కొన్ని పెద్ద హిట్ సినిమాలు కూడా అంతగా TRP స్కోర్ అందుకోలేకపోయాయి. కానీ తండేల్ మాత్రం వాటన్నింటిని అధిగమించి 2025లో “సంక్రాంతికి వస్తున్నాం” (18.22 TRP) తర్వాత జీ తెలుగులో రెండవ అత్యధిక రేటింగ్ సాధించిన సినిమా అయ్యింది. “పుష్ప 2: ది రూల్” కూడా 12.61 TRPతో రెండవ స్థానంలో ఉండగా, తండేల్ మూడవ స్థానం దక్కించుకుంది.
ఈ ఫలితాలతో తండేల్ టీవీ రిజల్ట్ చూస్తే, అది థియేటర్ల తర్వాత కూడా ప్రేక్షకుల మీద ఎంత ప్రభావం చూపిందో స్పష్టమవుతోంది. నాగ చైతన్య కెరీర్‌కు ఇది మరో మెరుగైన సినిమా అయ్యింది. డిజిటల్, టెలివిజన్, థియేటర్ మూడు వేదికల మీద విజయాన్ని అందుకున్న సినిమాల జాబితాలో తండేల్ కూడా చేరింది. అలాగే ఈ సినిమాతో దర్శకుడు చందూ మొండేటి, హీరో నాగ చైతన్య కాంబినేషన్‌కి మరింత క్రేజ్ పెరిగింది.
