తమ్ముడు మళ్లీ ట్రెండింగ్ లో..!
తమ్ముడు సినిమా నుంచి వస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఏదో ఒక విధంగా ట్రెండింగ్ లో ఉంటుంది.
By: Tupaki Desk | 25 Jun 2025 6:09 PMరాబిన్ హుడ్ డిజప్పాయింట్ చేయడంతో నితిన్ తమ్ముడు సినిమా మీద పూర్తి ఫోకస్ పెట్టాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమా దిల్ రాజు బ్యానర్ నిర్మించారు. సినిమాలో నితిన్ సరసన సప్తమి గౌడ హీరోయిన్ గా నటించగా వర్ష బొల్లమ్మ, లయ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. సినిమాకు అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ ఇచ్చాడు. తమ్ముడు సినిమా నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది.
సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గా రిలీజైన భూ అంటూ భూతం వచ్చి సాంగ్ సూపర్ హిట్ కాగా నెక్స్ట్ సినిమా నుంచి రెండో సాంగ్ గా జై బగళాముఖి సాంగ్ వచ్చింది. జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు రచించిన ఈ సాంగ్ ను అబీ వి పాడారు. ఈ సాంగ్ చూస్తుంటే జాతర టైం లో వచ్చేట్టుగా ఉంది. జై బగళాముఖీ అంటూ అమ్మ వారి మీద వచ్చిన ఈ పాట ఇన్ స్టంట్ గా నచ్చేసింది.
తమ్ముడు సినిమా నుంచి వస్తున్న ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఏదో ఒక విధంగా ట్రెండింగ్ లో ఉంటుంది. ట్రైలర్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయగా ఫస్ట్ సాంగ్ అదిరిపోయింది.. ఇక రెండో సాంగ్ గా వచ్చిన జై బగళాముఖీ కూడా సూపర్ అనిపించుకుంది. తప్పకుండా ఈ సినిమాకు అజనీష్ సాంగ్స్ ఇంకా బిజిఎం సూపర్ హైలెట్ అయ్యేలా ఉన్నాయి.
నితిన్ వేణు శ్రీరామ్ కాంబోలో ఒక మంచి కథతో తమ్ముడు సినిమా వస్తుంది. ఈ సినిమా మీద నిర్మాత దిల్ రాజు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. అందుకే సినిమా ప్రమోషన్స్ కి దిల్ రాజు ముందే ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. కంటెంట్ ఉన్న సినిమా ఎక్కువ జనాల్లోకి వెళ్లాలని తన ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు దిల్ రాజు. సో దిల్ రాజు కాన్ఫిడెన్స్ చూస్తుంటే తమ్ముడు సినిమా నితిన్ కి ఒక క్రేజీ హిట్ అందించేలా ఉంది. దిల్ రాజు తమ్ముడు మాత్రమే కాదు నెక్స్ట్ ఎల్లమ్మ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నాడు. సో తమ్ముడు హిట్ పడితే ఎల్లమ్మకి మంచి హై వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పొచ్చు. తమ్ముడు ప్రచార చిత్రాలన్నీ రోజు రోజుకి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మరి సినిమా ఏం చేస్తుందో చూడాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.