నాని కోసం 'తమ్ముడు' ఆగలేదు..!
ఐతే దిల్ రాజు నాని కోసం వెయిట్ చేయకుండా నితిన్ తో సినిమా పూర్తి చేశాడు.
By: Tupaki Desk | 23 Jun 2025 9:40 PM ISTఒక సినిమా కథ అనుకున్నప్పుడ్ ఆ రైటర్, డైరెక్టర్ ఒకరిని హీరోగా అనుకుని రాస్తారు. కొన్ని కథలు మాత్రమే ఎలాంటి హీరో ఫేస్ లేకుండా కొత్తగా రాసుకుంటారు. మిగతా కథకులు అంతా కూడా ఫలానా హీరో అన్న కోణంలోనే కథను రాస్తుంటారు. ఐతే క్యారెక్టర్ డ్రైవెన్ సినిమాలైతే ఈ కథలో ఎలాంటి హీరో అయినా సరే నప్పుతాడని అనిపిస్తుంది. కానీ ఒక కథ ఒకరి కోసం అనుకుని ఆ హీరోకి చెప్పాక అతని డేట్స్ వల్ల సినిమా చేయకపోతే మరొక హీరోకి ఆ ప్రాజెక్ట్ కి వెళ్తే అది రిలీజై సక్సెస్ కొడితే అయ్యో ఒక మంచి సినిమా మిస్ అయ్యామని ఫీల్ అవుతారు.
ఇలాంటివి ఇండస్ట్రీలో చాలా జరుగుతుంటాయి.. జరుగుతూనే ఉన్నాయి.. లేటెస్ట్ గా త్వరలో రిలీజ్ కాబోతున్న నితిన్ తమ్ముడు సినిమా కూడా మొదట హీరోగా న్యాచురల్ స్టార్ నానిని అనుకున్నారట. వేణు శ్రీరాం ఆల్రెడీ నానితో M.C.A సినిమా చేశాడు. సో ఆ సినిమా కాంబో మరోసారి రిపీట్ చేద్దామని తమ్ముడు నిర్మాత దిల్ రాజు ప్రయత్నాలు చేశారట. ఐతే నానికి తమ్ముడు కథ నచ్చినా కూడా కొన్నాళ్లు వెయిట్ చేయాలని అన్నాడట. తనకు వేరే కమిట్మెంట్స్ ఉండటం వల్ల నాని వెంటనే సినిమా చేసే అవకాశం లేకుండా పోయింది. అందుకే తమ్ముడు సినిమా కాదనాల్సి వచ్చింది.
ఐతే దిల్ రాజు నాని కోసం వెయిట్ చేయకుండా నితిన్ తో సినిమా పూర్తి చేశాడు. కథ బాగుంది కాబట్టి సినిమా నితిన్ తో కూడా వర్క్ అవుట్ అవుతుందని బలంగా నమ్మారు కాబట్టే అనుకున్న దాని కన్నా ఎక్కువ బడ్జెట్ పెట్టి తమ్ముడు సినిమా తీశారు దిల్ రాజు. సినిమా బడ్జెట్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో అనుకున్న దాని కన్నా కాస్త ఎక్కువే అయ్యింది కానీ సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు.
నితిన్ కి తమ్ముడు హిట్ ఇస్తే మాత్రం నాని కి పడి ఉంటే ఎలా ఉండేది అనే ఆలోచన రాక తప్పదు. నితిన్ తమ్ముడు సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమాకు సపోర్ట్ గా నిలిచింది. ఆడియన్స్ లో సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. జూలై 4న రిలీజ్ కాబోతున్న తమ్ముడు సినిమా నితిన్ కెరీర్ లో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
