దర్శకుడి పెళ్లికి హీరో నితిన్ కారణం..!
నితిన్ హీరోగా రూపొందిన 'తమ్ముడు' సినిమా విడుదలకు సిద్ధం అయింది. జులై 4న విడుదల కాబోతున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్స్‌గా సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మలు నటించారు.
By: Tupaki Desk | 12 Jun 2025 2:00 PM ISTనితిన్ హీరోగా రూపొందిన 'తమ్ముడు' సినిమా విడుదలకు సిద్ధం అయింది. జులై 4న విడుదల కాబోతున్న తమ్ముడు సినిమాలో హీరోయిన్స్‌గా సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మలు నటించారు. వకీల్ సాబ్ ఫేం వేణు శ్రీరామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాతో సీనియర్ హీరోయిన్ లయ రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. 20 ఏళ్ల తర్వాత లయ ఈ సినిమాలో నటించింది. నితిన్‌కి అక్క పాత్రలో లయ కనిపించింది. టైటిల్‌ను చూస్తూ ఉంటే సినిమా మొత్తం కథ ఆమె చుట్టూ తిరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. హీరోయిన్‌గా లయ చాలా సినిమాల్లో నటించింది, నటిగా మంచి ఫేమ్ ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్లింది. పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత లయ తిరిగి సినిమాల్లో రీ ఎంట్రీకి సిద్ధం అయింది.
తమ్ముడు సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఇటీవల సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ ఈవెంట్‌లో దర్శకుడు వేణు శ్రీరామ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నితిన్‌తో చాలా కాలం క్రితమే సినిమా చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల సెట్ కాలేదు అన్నాడు. నితిన్ వంటి హీరోలు ఇండస్ట్రీలో చాలా అరుదుగా ఉంటారు. సాధారణంగా హీరోలకు ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. కానీ నితిన్‌లో మాత్రం అది ఏమాత్రం కనిపించదు. ఆయన ఎప్పుడూ అభద్రతా భావంతో కనిపించ లేదు. ఆయన ఎప్పుడు చాలా ఓపెన్‌గా ఉంటారు అని వేణు శ్రీరామ్ అన్నారు.
సినిమా మేకింగ్ విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోనూ నితిన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఫ్రీడం కారణంగా తమ్ముడు సినిమాను అద్భుతంగా తీశామని చెప్పుకొచ్చాడు. ఇక నితిన్ సినిమా కోసం తాను గతంలో రచయితగా పని చేసే సమయంలో ఒక అమ్మాయితో పరిచయం అయ్యి, ఆమెను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. తన వ్యక్తిగత జీవితంలో నితిన్ చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పకనే చెప్పాడు. ఇక హీరోగా నితిన్ తో తాను తీసిన ఈ సినిమాతో హిట్ కొట్టడం ఖాయం అని కూడా వేణు శ్రీరామ్ చెప్పుకొచ్చాడు. ఈ సినిమా సుదీర్ఘ కాలంగా సెట్స్ పై ఉంది. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చిన తమ్ముడు ఎట్టకేలకు పూర్తి అయ్యి విడుదలకు సిద్ధం అయింది.
నితిన్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. అందుకే ఈ సినిమాపై ఆయనతో పాటు ఆయన అభిమానులు నమ్మకం పెట్టుకుని వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనేందుకు చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అందులో ముఖ్యమైనది ఒక మంచి కమర్షియల్ సబ్జెక్ట్‌తో ఈ సినిమాను రూపొందించారు. అంతే కాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత కావడం వల్ల కూడా అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ తమ్ముడు సినిమా ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుంది అనేది తెలియాలి అంటే జులై 4 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమా హిట్ అయితే లయ వరుస సినిమాలను తెలుగులో చేస్తుందేమో చూడాలి. ఈ సినిమా విజయం హీరో నితిన్‌కి, దర్శకుడు వేణు శ్రీరామ్‌తో పాటు లయకి అత్యంత కీలకం. మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
