నితిన్ తమ్ముడు మూవీ.. అదిరిపోయే డీల్స్ ఫిక్స్..
కానీ ఈసారి తమ్ముడు మూవీ.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుండడం విశేషం. ఏదేమైనా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తమ్ముడు మూవీ రూ.38 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది.
By: Tupaki Desk | 27 Jun 2025 12:50 AM ISTటాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఇప్పుడు తమ్ముడు మూవీపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగేళ్లుగా సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న ఆయన.. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో తమ్ముడుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. జులై 4వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.
సినిమాలో నితిన్‍కు జోడీగా కాంతార ఫేమ్ సప్తమి గౌడ నటిస్తుండగా.. సీనియర్ నటి లయ కీలకపాత్ర పోషిస్తున్నారు. నితిన్ అక్క రోల్ లో కనిపించనున్నారు. ప్రమాదాల నుంచి అక్కను కాపాడేందుకు ఏదైనా చేసే తమ్ముడి చుట్టూ తమ్ముడు మూవీ స్టోరీ ఉండనుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అక్కాతమ్ముళ్ల బంధం, యాక్షన్ మెయిన్ టాపిక్స్ గా తెలుస్తోంది.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సినిమాను నిర్మించగా, నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో అదిరిపోయే డీల్ ఫిక్స్ అయినట్లు ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీ.. తమ్ముడు మూవీ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు ప్రముఖ స్టార్ మా సొంతం చేసుకున్నట్లు సమాచారం.
సాధారణంగా దిల్ రాజు నిర్మించే సినిమాల్లో దాదాపు అన్నీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ ఈసారి తమ్ముడు మూవీ.. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి రానుండడం విశేషం. ఏదేమైనా నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా తమ్ముడు మూవీ రూ.38 కోట్లను రాబట్టినట్లు తెలుస్తోంది. అదే సమయంలో మూవీ బడ్జెట్ రూ.75 కోట్లు అని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ఆ లెక్కన నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని చూసుకుంటే.. తమ్ముడు మూవీ రూ.37 కోట్లను థియేటర్స్ ను రావాల్సి ఉంది. అయితే ఇప్పటికే తమ్ముడు మూవీపై మంచి బజ్ నెలకొంది. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఆడియన్స్ ను మెప్పించింది. నితిన్ కు సాలిడ్ హిట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
అయితే మరికొద్ది రోజుల్లో ప్రమోషన్స్ లో భాగంగా రెండో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అదే సమయంలో తక్కువ గ్యాప్ లో వినూత్నంగా మూవీని ప్రమోట్ చేయాలని చేస్తున్నారు. సినిమాపై అందరి దృష్టి పడేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మరి తమ్ముడు సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
