Begin typing your search above and press return to search.

వకీల్ సాబ్ తర్వాత తమ్ముడి కోసమే అంటున్న ఎడిటర్..!

ఒక సినిమా ప్రేక్షకులను చేరవేసే క్రమంలో అది హిట్టా ఫట్టా అన్న మాట తేల్చేది మొదటి రోజు మొదటి ఆట.

By:  Tupaki Desk   |   1 July 2025 12:15 AM IST
వకీల్ సాబ్ తర్వాత తమ్ముడి కోసమే అంటున్న ఎడిటర్..!
X

ఒక సినిమా ప్రేక్షకులను చేరవేసే క్రమంలో అది హిట్టా ఫట్టా అన్న మాట తేల్చేది మొదటి రోజు మొదటి ఆట. తెర మీద సినిమాలో ఉన్నది స్టార్ హీరోనా లేదా కొత్త హీరోనా అన్నది కాదు ఎంచుకున్న కథ.. దానికి తగిన కథనం.. మ్యూజిక్.. నటీనటుల ప్రతిభ ఇలా అన్నీ కుదరాలి. డైరెక్షన్ గురించి తెలిసిందే. ఐతే వీరంతా ఎంత చేసినా ఒక ఎడిటర్ సరైన వాడైతేనే సినిమా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది.

కొన్ని సినిమాలు ఎడిటింగ్ వల్ల సక్సెస్ అయినవి ఉంటాయి. కొన్ని సినిమాలు అదే ఎడిటింగ్ మైనస్ అనేలా ఉంటాయి. ఐతే లేటెస్ట్ గా నితిన్ తమ్ముడు సినిమాకు ప్రవీణ్ పూడి ఎడిటర్ గా పనిచేశాడు. తమ్ముడు రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో ఎడిటర్ ప్రవీణ్ పూడి తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. సినిమా కోసం వేణు శ్రీరామ్ తో కలిసి చాలా గంటలు పనిచేశామని అన్నారు. అంతేకాదు ఆయన చేసిన వకీల్ సాబ్ సినిమా కోసమే ఎక్కువ టైం పనిచేశాం కానీ ఈ సినిమాకు అంతకన్నా ఎక్కువ గంటలు పనిచేశామని అన్నారు ప్రవీణ్ పూడి. సినిమాలో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ వల్ల కొంత ఎక్కువ టైం పట్టిందని అన్నారు ప్రవీణ్ పూడి.

ఇక స్పీచ్ లో భాగంగా దిల్ రాజు బ్యానర్ లో తనకిది 6వ సినిమా కాగా.. వేణు శ్రీరామ్ తో 3వ సినిమా అని. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక మంచి అనుభూతి కలిగిస్తుందని అన్నారు. సినిమాలో నావల్టీ థియేటర్ నుంచి బయటకు వెళ్లాక కూడా వెంటాడుతుందని అన్నారు. ఈ సినిమా వల్ల తనకు తెలియని కొన్ని విషయాలు తెలిశాయని అన్నారు. ఇక కెమెరా మెన్ గుహన్ తో తొలిసారి పనిచేశానని ఆయన చేసిన అతడు సినిమా తనకు చాలా ఇష్టమని అన్నారు.

సాధారణంగా సినిమా రిలీజ్ టైం లో ఎడిటర్స్ అస్సలు ఖాళీగా ఉండరు. సినిమా రేపు రిలీజ్ అనగా ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. కానీ తమ్ముడు సినిమా రిలీజ్ ట్రైలర్ ఈవెంట్ లో ఎడిటర్ రావడం ఇంత కాన్ఫిడెంట్ గా మాట్లాడటం చూస్తుంటే దిల్ రాజు చెప్పినట్టుగానే సినిమా బాగా వచ్చిందన్న మాట నిజమే అనిపిస్తుంది. జూలై 4న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.