Begin typing your search above and press return to search.

#NBK109 : బాలయ్య వదలట్లేదుగా..!

ఈ జోష్ లో వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   8 March 2024 10:19 AM GMT
#NBK109 : బాలయ్య వదలట్లేదుగా..!
X

నందమూరి బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ, వీర సింహారెడ్డి మరియు భగవంత్‌ కేసరి సినిమాలతో హిట్ కొట్టి హ్యాట్రిక్ సొంతం చేసుకున్నాడు. ఈ జోష్ లో వాల్తేరు వీరయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే.

ఈ ఏడాదిలోనే విడుదల అవ్వబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. ఈ సమయంలో సినిమా సంగీత దర్శకుడిగా థమన్‌ ను ఎంపిక చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.

బాలయ్య హ్యాట్రిక్ సినిమాలకు సంగీతాన్ని అందించింది థమన్‌ అనే విషయం తెల్సిందే. అదే సెంటిమెంట్‌ తో బాలయ్య తాజా సినిమాకు కూడా థమన్ కి వాయించే బాధ్యత అప్పగించినట్లు చెప్పుకుంటున్నారు. బాలయ్య సినిమా అనగానే థమన్‌ కూడా రెచ్చి పోయి మరీ స్పీకర్స్ బద్దలయ్యే బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌ ఇస్తున్నాడు.

కచ్చితంగా డబుల్‌ హ్యాట్రిక్‌ అయ్యే విధంగా బాలయ్య, బాబీ మూవీకి మ్యూజిక్ ఇస్తాను అంటూ థమన్‌ కూడా ఫ్యాన్స్ కి హామీ ఇచ్చాడు. థమన్ పై బాలయ్య పెట్టుకున్న నమ్మకం ను ఎంత వరకు నిలుపుకుంటాడు అనేది చూడాలి.

బాలయ్య, థమన్‌ కాంబినేషన్‌ లో వచ్చిన మూడు సినిమాల ఆల్బమ్స్ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. పాటలకు మించి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్ ఓ రేంజ్‌ లో దుమ్ము రేపింది. అఖండ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ రికార్డ్‌ ల గురించి ఇంకా సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది. అందుకే థమన్ ని వదలకుండా బాలయ్య కంటిన్యూ చేస్తున్నాడు.