Begin typing your search above and press return to search.

బ్రో ని అలా చూడలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను: తమన్

తాజాగా సక్సెస్ మీట్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడిన తమన్, తాను ఈ మూవీ మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అయ్యానని అంగీకరించారు

By:  Tupaki Desk   |   31 July 2023 5:18 PM GMT
బ్రో ని అలా చూడలేదు, అందుకే ఫెయిల్ అయ్యాను: తమన్
X

ప్రస్తుతం టాలీవుడ్ లో తమన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలకు మ్యూజిక్ ఆయనే అందిస్తున్నారు. ఇటీవల ఆయన పవన్, సాయిధరమ్ తేజ్ ల బ్రో మూవీ కి కూడా ఆయనే మ్యూజిక్ అందించారు.

అయితే, వకీల్ సాబ్, బీమ్లా నాయక్ మూవీలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన ఆయన, బ్రో విషయంలో మాత్రం నిరాశ పరిచారనే చెప్పాలి. మ్యూజిక్ అస్సలు బాలేదని, తమన్ ని విపరీతంగా ట్రోల్ చేశారు.

మూవీకి ముందు ఆయనకు ఈ విషయంలో ట్రోల్స్ రాగా, దానిని తమన్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. ఆ మూవీలో ఆ పాటలకు అంతకు మించి ఇవ్వలేం అంటూ సమర్థించుకున్నారు. అయితే, తాజాగా సక్సెస్ మీట్ లో చాలా ఎమోషనల్ గా మాట్లాడిన తమన్, తాను ఈ మూవీ మ్యూజిక్ విషయంలో ఫెయిల్ అయ్యానని అంగీకరించారు.

అసలు మ్యాటర్ లోకి వెళితే, బ్రో సక్సెస్ మీట్ నిర్వహించగా, దానికి తమన్ హాజరయ్యారు. ఆ సమయంలో ఈ మూవీకి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలా అని తాను చాలా కష్టపడ్డానని చెప్పారు. మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బాధ్యతగా చేశానన్నారు.

ఈ మూవీని తాను కమర్షియల్ గా చూడలేకపోయానని చెప్పారు. అందుకే ఈ సినిమా పాటల విషయంలో తాను ఫెయిల్ అయ్యానేమో అంటూ పేర్కొన్నారు. ఇంకేముంది తమనే స్వయంగా అంగీకరించాడని నెట్టింట ఆ వీడియోని షేర్ చేస్తున్నారు.

అయితే, దీనికి ముందు తమన్ చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన జీవితంలో తివిక్రమ్ పాత్ర, సముద్రఖనితో పరిచయం, సాయిధరమ్ తేజ్ తో అనుబంధాన్ని చాలా ఎమోషనల్ గా చెప్పారు. తివిక్రమ్ తన బలం, ధైర్యం అని పేర్కొన్నాడు.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజీ ఇలా వరుసగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పనిచేయడానికి కారకులైన త్రివిక్రమ్ కి తాను రుణపడి ఉంటానన్నారు.నా సంగీతంలో ఇంత పరిణితి కనబడటానికి కారణం త్రివిక్రమ్ గారే అని తమన్ అన్నారు.

ఇక సాయి ధరమ్ తేజ్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోయినప్పుడు ఎంత బాధపడ్డానో, సాయి ధరమ్ తేజ్‌కు యాక్సిడెంట్ అయినప్పుడు అంత బాధపడ్డానని, ఆ రెండు సార్లు మాత్రమే తాను దేవుడిని తిట్టానని చెప్పాడు. సాయిధరమ్ తేజ్ తన మనసుకి చాలా దగ్గరైన మనిషి. అందుకే తేజ్ సినిమాకి మనసుతో పని చేశాను అని చెప్పారు. తమన్ చెబుతుంటే, తేజ్ కూడా ఎమోషనల్ అయ్యి, అతనిని హత్తుకోవడం విశేషం.